నేడు దివంగత మాజీ రాష్ట్రపతి, డాక్టర్‌ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి.

Author: Share:

పుట్టిన దేశం కోసం జీవితాన్నంతా ధారపోసి అణువణువునా భారతీయతను నింపుకున్న మిస్సైల్ మ్యాన్.

జూలై-27 కలాం వర్ధంతి సందర్భంగా దేశం ఆ మహానుభావుడి సేవలు స్మరించుకుంటోంది.

భారత దేశాన్ని మిస్సైల్ పవర్‌గా మార్చిన గొప్ప వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం, తమిళనాడులోని రామేశ్వరంలో పేద ముస్లిం కుటుంబంలో 1931, అక్టోబర్ 15న జన్మించిన ఆయన తర్వాత కాలంలో దేశ ముఖ చిత్రాన్నే మార్చేశారు.

చదవడం ఆయన ప్యాషన్. తెలుసుకున్న ప్రతి విషయాన్ని.. నలుగురితో పంచుకోవడం ఇష్టం. ఏరో స్పేస్ లో ఇంజినీరింగ్ పూర్తిచేసి విజ్ఞానశాస్త్రంలో వరుస పరిశోధనలు చేశారు. శాస్త్రాన్నే కొత్త స్టాండర్డ్స్ కు తీసుకెళ్లారు

యుద్ధ పైలట్ కావాలన్న ఆశతో పరీక్ష రాసి ఫెయిలైన అబ్దుల్ కలాం…ఆ తర్వాత దేశాన్ని తన మార్గంలో నడిపి అసలైన పైలట్ అనిపించుకున్నారు.

భౌతిక శాస్త్రం శాస్త్రవేత్తగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో చరిత్రాత్మక విజయాలు ఎన్నో సాధించిన కలాం, డిఫెన్స్ రంగంలో మొదలైంది. రక్షణ రంగానికి అవసరమైన తేలికపాటి హెలికాప్టర్ తయారీ ప్రాజెక్ట్ లో కలాంకు మొదట ఛాన్స్ వచ్చింది. ఆ పోస్ట్ లో ఎక్కువ కాలం ఉండలేక పోయారు, ఇస్రో వైపు అడుగులు వేశారు. అక్కడే ఆయన రాకెట్ మేకర్ అయ్యారు. SLV, PSLV రాకెట్ల తయారీ తో మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఎదిగారు. అగ్ని, పృధ్వీ సహా అనేక మిస్సైల్స్ ఆయన డైరెక్షన్ లోనే నింగిలోకి దూసుకెళ్లాయి. బాలిస్టిక్ క్షిపణులను అభివృద్ధికి ఏర్పాటైన ప్రాజెక్ట్ డెవిల్ మరియు ప్రాజెక్ట్ వలింట్ లకు కలాం డైరెక్టర్ గా పనిచేశారు. జూలై 1992 నుండి డిసెంబర్ 1999 మధ్య ప్రధాన మంత్రి శాస్త్రీయ సలహాదారుగా మరియు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ముఖ్యకార్యదర్శి గా వ్యవహరించారు, అదే సమయంలో పోఖ్రాన్-II అణు పరీక్షలలో కలాం కీ రోల్ ప్లే చేశారు.

READ  Prime Minister Modi has amazing ability of resolving decades pending disputes.

వైద్య పరిశోధనాల్లోనూ కలాం సత్తా చాటారు. కార్డియాలజిస్ట్ డాక్టర్ సోమ రాజు పాటు.. రీసెర్చ్ చేశారు. తక్కువ ధర కలిగిన కొరోనరీ స్టెంట్ ను అభివృద్ధి చేశారు. 2012లో ఇద్దరూ కలిసి, గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ కోసం టాబ్లెట్ పీసీని రూపొందించారు. కృత్రిమ తేలిక కాలు తయారు చేయడంలో కలాం చేసిన పరిశోధనలు వికలాంగులకు వరంగా మారాయి.

జులై 18, 2020 న భారత ప్రథమ పౌరుడిగా ఎన్నికయ్యారు. రాష్ట్రపతి భవన్ కు వెలుగులు అందించి ప్రజాభవన్ గా మార్చేశారు కలాం. అందరివాడుగా అందరితో కలిసిపోయారు. ఆ హోదా ముగిసన తర్వాత… మాజీ రాష్ట్రపతిగా సామాన్యుడిగానే జీవించారు. IIT, IIM, IISC లో గేస్ట్ ప్యాకల్టీగా క్లాసులిచ్చారు కలాం. అంతులేని దేశభక్తుడు అబ్దుల్ కలాం. చేసే ప్రతి పనిలో వేసే ప్రతి అడుగులో దేశాన్ని చూసుకునేవారు కలాం. తన మల్టీ టాలెంట్ తో పరిశోధనాల్ని పరుగులు పెట్టించారు.

మిస్సైల్ మ్యాన్ గా, సైంటిస్ట్ గా, ఎంత ఎదిగినా ఒదిగి అడుగులు వేశారు. అణుశాస్ర పితామహుడు హోమీ జే బాబా లేని లోటు తీర్చారు కలాం.

పాఠాలు, ప్రసంగాలతో యువతరాన్ని వెన్నుతట్టి లేపి పుస్తకాలు, రచనలతోనూ యువతరం మెదళ్లలో అగ్ని రాజేశారు. ప్రాథమిక స్థాయిలోనే పిల్లల్లో క్రియేటివిటీ పెంచే చదువులు రావాలని పిలుపునిచ్చారు. బట్టీపట్టే చదువులు కాదు ప్రయోగాలు ముఖ్యమని విద్యావ్యవస్థకు దిక్చూచి అయ్యారు. విద్యార్థుల్లో నిరంతరం స్ఫూర్తి నింపాల్సింది ఉపాధ్యాయుడేనని చెప్పడమే కాదు చేసి చూపించారు. దేశానికే ఆదర్శప్రాయమైన ఉపాధ్యాయుడిగా చరిత్రలో నిలిచిపోయారు. చివరి క్షణాల్లోను విద్యార్థులకు పాఠాలు చెబుతూనే తుదిశ్వాస విడిచారు. అంతటి మహానుభావుడు మన మధ్య లేకున్నా ఆయన సేవలు మాత్రం కలకాలం నిలిచి ఉంటాయి.

2015, జులై 27న గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన అబ్దుల్ కలాంకు ఘన నివాళి.

Previous Article

TRS is doubled faced on Cow Slaughtering : T Raja Singh

Next Article

Telangana: HM Mahmood Ali appeals not to give Cow as sacrifice this Bakrid, legal action if found!

You may also like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

five × two =