గుంతలు లేని రోడ్డు చూపిస్తే రూ 1 లక్ష బహుమానం

Author: Share:

హైదరాబాద్ నగరంలో గుంతలు లేని రోడ్ చూపిస్తే లక్ష రూపాయల బహుమానాన్ని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ ను డల్లాస్ చేస్తానన్న సీఎం కేసీఆర్.. కనీసం నాళాల్లో పూడిక కూడా తీయించలేదని ధ్వజమెత్తారు. 

డబుల్ బెడ్రూం ఇళ్లపై టీఆర్ఎస్ సర్కార్ మాట తప్పిందని చెబుతూ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. హైదరబాద్ లో డబుల్ బెడ్రూం ఇళ్లకు 30 లక్షల దరఖాస్తులు వచ్చాయని చెబుతూ  డబుల్ బెడ్రూం ఇళ్లపై ప్రజలు సర్కార్ ను నిలదీయాలని పిలుపిచ్చారు. 

గత ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టి టీఆర్ఎస్ గెలిచిందని పేర్కొంటూ  టీఆర్ఎస్ ఇచ్చిన హామీలను పక్కన పెట్టిందని మండిపడ్డారు. వర్షం వస్తే రాజ్ భవన్, సెక్రటేరియేట్ ముందు నీరు నిలుస్తుందని, చిన్న వర్షాలకే నగరం మునిగిపోయే పరిస్థితి వచ్చిందని దయ్యబట్టారు. డ్రైనేజీ వ్యవస్థను ఏ మాత్రం బాగుచేయలేదని విమర్శించారు. 

హైదరాబాద్ తో బీజేపీకి విడదీయరాని సంబంధం ఉందని చెబుతూ గ్రేటర్ లో గెలవాలనే లక్ష్యంతోనే పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. భారీ వర్షాలతో 15 లక్షల మంది నిరాశ్రయులు కాగా, రూ .67,000  కోట్లు ఖర్చు పెట్టామంటున్న ప్రభుత్వం కనీసం వర్షపు నీరు బయటకు పంపే ప్రయత్నం చేయలేదని ఎద్దేవా చేశారు.

టీఆర్ఎస్ గ్రాఫిక్స్ తో ప్రజలను మభ్యపెడుతుందని తెలిపారు. పాతబస్తీని ఇస్తాంబుల్ చేస్తమన్నారని, హైదరాబాద్ చుట్టూ 4 ఆస్పత్రులు కట్టిస్తామని మర్చిపోయారని ధ్వజమెత్తారు. మూసీ ప్రక్షాళన ఎందుకు కాలేదని ప్రశ్నించారు.  జీహెచ్ఎంసీని అప్పుల పాలు చేశారని విమర్శించారు.

Source
Nijamtoday.com

Previous Article

AIMIM applying false colour for love-jihad: BJP leader N V Subhash

Next Article

A Religion can’t survive for long without a culture. Festivals are an integral part of it

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

two × 3 =