అక్రమ అరెస్టులు విద్యార్థులను ఆపలేవు- ABVP

Author: Share:

రాష్ట్రంలో పదవీవిరమణ వయస్సు పెంపు నిర్ణయాన్ని విరమించుకోవాలని, 1.91 లక్షల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ABVP ఆధ్వర్యంలో నయీమ్ నగర్ లో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది.


ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పున్నం వేణు మాట్లాడుతూ”పదవీవిరమణ వయస్సు పెంపు నిర్ణయాన్ని విరమించుకోవాలి.
యూనివర్సిటీలలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. JL, DL, DIET, DSc, MEO, DEO, DIET, B.Ed College lectures etc. పోస్టులను వెంటనే భర్తీ చేయాలి.
గ్రూప్ -1, గ్రూప్ -2, గ్రూప్ -3 etc. పోస్టులను వెంటనే భర్తీ చేయాలి.
ఉద్యోగాల భర్తీ కోసం TSPSC క్యాలెండర్ విడుదల చేయాలి.
PRC నివేదిక ప్రకారం వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న 1.91 లక్షల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి.


33 కొత్త జిల్లాలలో ఒక్కో జిల్లాకు 2000 ఉద్యోగాల చొప్పున 66000 వేల నూతన ఉద్యోగాల కల్పనను చేసి వెంటనే భర్తీ చేయాలి.”” అని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ అర్బన్ జిల్లా కన్వీనర్ డేరంగుల గణేష్, వరంగల్ మహానగర కార్యదర్శి తరుణ్ పటేల్ మరియు కార్యకర్తలు రాజ్ కుమార్ ,పాషా,లిఖిత్, రామకృష్ణ, బలరాం, యశ్వంత్, బాలాజీ, రాజశేఖర్, అరుణ్ సాయి తదితరులు పాల్గొన్నారు.

Previous Article

Its Anil Vs Anil in the police officers transfer racket

Next Article

Shaheed Diwas celebrated in Old City Hyderabad.

You may also like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

one × four =