భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు: భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్
భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరు రాజ్యాంగ విలువలను పాటించాలని ఆయన అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు.
కఠోర పరిస్థితుల్లోనూ సరిహద్దులను జవాన్లు కాపాడుతున్నారని అన్నారు. ప్రజలంతా రైతులకు రుణపడి ఉండాలని, రైతులు, సైనికులు దేశానికి వెన్నుముక అని రామ్ నాథ్ కోవింద్ అన్నారు.
గత ఏడాది ప్రపంచమంతా విపత్కర పరిస్థితులను ఎదుర్కొందని అన్నారు. వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికుల సేవలు అమూల్యం అని పేర్కొన్నారు. త్వరగా కరోనా వ్యాక్సిన్ తీసుకువచ్చిన శాస్త్రవేత్తలకు రాష్ట్రపతి అభినందనలు తెలిపారు. ఇతర దేశాలకు కూడా వ్యాక్సిన్ అందిస్తున్నామని అన్నారు