తెలుగు

భారతీయ ముస్లింలలో ద్వేషం నింపుతున్న ఆల్ ఖైదా!

భారతీయ ముస్లింలలో దేశం పట్ల తీవ్రమైన ద్వేషాన్ని రగిల్చేందుకు కరడుగట్టిన ఉగ్రవాదసంస్థ ఆల్ ఖైదా ప్రయత్నం చేస్తోంది. దేశంలోని ముస్లిం మేధావులు, విద్యార్థులు జిహాద్ లో పాల్గొనాలంటూ పిలుపు ఇస్తోంది.

పాకిస్థాన్ ఇంటిలెజెన్స్ సంస్థ ఐఎస్ఐ, ఆల్ ఖైదా మిడిల్ ఈస్ట్ వింగ్ సంస్థలు భారత్ లో ముస్లింలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయని భద్రత సంస్థలు తెలిపాయి. కశ్మీర్ లో ఉగ్రవాదులను కూడా భారత్ పై దాడులు చేయాలంటూ పిలుపునిచ్చినట్లు గుర్తించాయి. 

పౌరసత్వ సవరణ చట్టంను సాకుగా చూపుతూ భారత్ లో ముస్లింలపై వివక్ష అంటూ ప్రచారం సాగిస్తున్నాయని ఆర్మీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. 

సోషల్ మీడియాలో ముస్లిం యువతను రెచ్చగొట్టే విధంగా ప్రచారం చేస్తూ దేశంపై వారిలో ద్వేషం పెంచుతున్నారని,  ఇలాంటి 2794 లకు పైగా ట్విట్టర్ అకౌంట్లను తాము గుర్తించామని ఆయన వెల్లడించాయిరు. 

గల్ఫ్ దేశాలతో భారత్ సంబంధాలను దెబ్బ తీసేందుకు ఇలాంటి కుట్రలు చేస్తు్న్నారంటూ చెప్పారు. ఐతే కొంతమంది ముస్లిం మేధావులు కూడా వీరి ట్రాప్ లో -పడిపోతున్నారని వాస్తవాలు తెలుసుకోకుండా ఫేక్ ప్రచారాలను నమ్ముతున్నారని విచారం వ్యక్తం చేశారు. 

మరోవంక,  భారత్ లో ముస్లింలకు అన్యాయం జరుగుతోందంటూ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (ఓఐసీ), కువైట్ ప్రభుత్వం, కొన్ని అరబ్ సంస్థలు కూడా ఇటీవలే ఆరోపణలు చేశాయి.  

Source
Nijam.org

Have your say

one + thirteen =