అయోధ్యలో ఆలయం కేవలం హిందూ మతస్తులకు చెందింది కాదు, భారతీయుల ఆలయం!

Author: Share:

అయోధ్యలో ఆలయం కేవలం హిందూ మతస్తులకు చెందింది కాదు, భారతీయుల ఆలయం! , ఓవైసీ చవకబారు విమర్శలను ఖండించిన బండి సంజయ్

అయోధ్యలో రామ మందిర నిర్మాణ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీపై హైదరాబాద్ ఎంపీ అసుదుద్దీన్‌ ఓవైసీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ కుమార్ ఈరోజు వో ప్రకటనలో‌ ద్వజమెత్తారు.

హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడి జన్మభూమి రామ మందిర నిర్మాణ ఏర్పాట్లు జరుగుతున్న తరుణంలో ప్రధానమంత్రిపై అసదుద్దీన్‌ ఓవైసీ చవకబారు విమర్శలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

ఆగస్టు 5న జరిగే భూమి పూజ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముఖ్యఅతిథిగా హాజరై, శంకుస్థాపన చేస్తారని వెల్లడించారు.

దీనిపై అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయన్నారు. అన్ని మతాలను సమానంగా గౌరవించడమే సెక్యులరిజమని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల ఆకాంక్ష మేరకు, ప్రధాని రామమందిర శంకుస్థాపనకు వస్తున్నారని తెలిపారు.

ఈ ఆలయం కేవలం హిందూ మతస్తులకు చెందింది కాదని, ఇది భారతీయుల ఆలయయని పేర్కొన్నారు.

కోట్లాది మంది ప్రజల ఆత్మ గౌరవానికి సంబంధించిన ఈ మహాయజ్ఞ ప్రారంభ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ పాల్గొనడం భారతీయులందరికీ గర్వకారణమని బండి సంజయ్‌ కొనియాడారు.

400 ఏళ్లుగా అయోధ్యలో ఉన్న బాబ్రీ మసీదు ఉంది అనడం నిజమైతే మరీ అంతకుముందు వేల ఏళ్లుగా అక్కడ ఉన్న శ్రీరామ మందిరాన్ని ఎవరు ధ్వంసం చేశారని బండి సంజయ్‌ ప్రశ్నించారు.

READ  రామమందిరం నిర్మాణం కోసం 28 ఏండ్లగా ఉపవాస దీక్ష చేస్తున్న 81ఏళ్ల ఊర్మిళా చతుర్వేది.

భారత ప్రభుత్వం సుప్రీం కోర్టుకు నివేదించిన మేరకు ఎటువంటి సమస్యలు లేకుండా, అందరిని కలుపుకుంటూ, ఆమోదయోగ్యంగా, శాంతియుతంగా ఈ ఆలయ నిర్మాణం జరుగుతుందన్నారు.

దేశ ప్రధానిగా సర్వ మానవాళి క్షేమాన్ని కోరుకునే హిందూ మతానికి చెందిన వ్యక్తిగా మోదీ కోట్లాదిమంది ఆకాంక్షలకు అనుగుణంగా, అయోధ్యలో చేపట్టే భవ్య రామమందిర నిర్మాణానికి పునాది వేసే అపూర్వ ఘట్టంలో పాల్గొనడం చారిత్రాత్మక అవసరమని ఆయన‌ అన్నారు.

Previous Article

Covid-19 : 4 Weeks of Hell, he lost mother, father & bother. Deccan Hospitals Charged 42 Lakhs

Next Article

Great Sant Tulasidas, The creator of “Ramcharit Manas”

You may also like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

19 − six =