తెలుగు

ఆనాటి తెలంగాణ ఉద్యమకారుడే నేటి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు..

తెలంగాణ కోసం ఢిల్లీ వీధుల్లో అప్పటి UPA కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి , తెలంగాణ ఉద్యమంలో లాఠీ దెబ్బలు తిని.., తిండి లేక ,జేబులో డబ్బులు లేక ఎక్కడో ఒక మూలన ఢిల్లీలో ఉండి తెలంగాణ కోసం పోరాడి తెలంగాణ సాధనలో ముఖ్యపాత్ర పోషించిన వ్యక్తి బండి సంజయ్. రసమయి బాలకిషన్ లాంటి గాయకులను తీసుకువచ్చి యువతలో ఉత్సాహం నిప్పిన ఉద్యమకారుడు నేటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు.

ఢిల్లీ లో సోనియా గాంధీ ఇంటి ముట్టడి కార్యక్రమం లో పాలుపంచుచుకున్నప్పుడు పోలీస్ దాడి లో గాయపడ్డ సంజయ్ నేటికీ తన పోరాటం కొనసాగించడం గొప్ప విషయం.

ఉద్యమ సమయంలోనే కాకుండ నేటికి తన ఉపిరి ఉన్నంతవరకూ కూడ తెలంగాణా ప్రజల కోసం దొరల పాలనను తలపిస్తున్నా కల్వకుంట్ల కుటుంబ పాలనను అంతం చేసేవరకు అలుపెరుగనీ పోరాటం చేస్తున్న తెలంగాణ తల్లి తనయుడుగా ముందుకు సాగడం ఎంతో హర్షించదగిన విషయమ్.

Author
@BantuVyshnavi

Have your say

six + 13 =