భూపాలపల్లి : శ్రీనివాస్ త్వరగా కోలుకోవాలని హనుమాన్ దేవాలయంలో పూజలు నిర్వహించిన భూపాలపల్లి అసెంబ్లీ ఇంచార్జి కీర్తి రెడ్డి.

Author: Share:

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను ఇటీవల అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ బీజేపీ కార్యకర్త శ్రీనివాస్ రాష్ట్ర బీజేపీ కార్యాలయం ముందు ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న విషయం తెలిసందే. దీన్ని గమనించిన స్థానికులు వెంటనే సమీపంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. శ్రీనివాస్ ‌కు 40 శాతం గాయాలు అయినట్టు తెలుస్తోంది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆత్మాహుతి కి పాల్పడ్డ శ్రీనివాస్ త్వరగా కోలుకోవాలని స్థానిక హనుమాన్ దేవాలయం లో పూజా కార్యక్రమం నిర్వహించారు చందుపట్ల కీర్తి రెడ్డి, బీజేపీ భూపాలపల్లి అసెంబ్లీ ఇంచార్జి మరియు స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబెర్

ఈ సందర్భంగా కీర్తి రెడ్డి మాట్లాడుతూ:
శ్రీనివాస్ ఆత్మహత్యా యత్నం బాధాకరం.

ప్రశ్నించే వారిపై ప్రభుత్వం లాఠీ ఛార్జ్ చేసి జైళ్ళకు పంపుతోంది ఎన్ని కేసులు పెట్టిన, జైళ్లకు పంపిన ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ధైర్యంగా పోరాడతాం అని తెలిపారు. తెలంగాణలో కాషాయ జెండాను రెపరెపలాడించే వరకు కష్టపడి పని చేద్దాం అని తెలిపారు.

కార్యకర్తలు ధైర్యాన్ని కొలిపోకుండా ఉండాలి ఇలాంటి ఘటనలకు పాలుపడకూడదు అని తన కార్యకర్తలు ధైర్యం చెప్పుకొచ్చారు.

ఈ యెక్క కార్యక్రమంలో బీజేపీ భూపాలపల్లి జిల్లాకి చెందిన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Previous Article

విచ్చలవిడిగా నోట్ల కట్టలతో తెరాస పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు హోటళ్లలో అధికార దుర్వినియోగం చేస్తుంటే పోలీస్ యంత్రాంగం నిద్రమత్తులో ఉందా ? : బండి సంజయ్

Next Article

Byelection: Is Dubbaka a road way to GHMC ?

You may also like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

four × 2 =