తెలుగు

ఫిట్ మెంట్ పేరుతో కేసీఆర్ కొత్త డ్రామా, ప్రభుత్వం పై బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్.

ఉద్యోగులకు ఫిట్ మెంట్ పేరుతో కేసీఆర్ కొత్త డ్రామా కు తెరలేపాడు. ఇప్పుడిస్తా, అప్పుడిస్తా అని వూరించి, వూరించి మూడేండ్ల తర్వాత ఇప్పుడు బిశ్వల్ కమిటీ రిపోర్ట్ తో వుసూరు అనిపించిండు అని ఎద్దేవా చేశారు.

అందరినీ మోసం చేసే, ఉద్యోగాలు ఇస్తా అని పిలగాండ్లను, నిరుద్యోగ భృతి ఇస్త అని నిరుద్యోగులను, సన్న వడ్లు అని రైతులను, ఇప్పుడు ఉద్యోగులను కూడా మోసం చేసిండు. 7.5 %, 10 % ఫిట్ మెంట్ ఇయ్యనీకే ఒక కమిటీ వేయల్నా మూడేండ్లు టైమ్ తీసుకోవాల్నా..? అని ప్రశ్నించారు సంజయ్.

అసలు బిష్వాల్ కమిటీ పని చేసిందా…స్వతంత్రంగా పని చేయనిచ్చారా ?
ఫాం హౌజ్ ల కూసోని పి.అర్.సి రాయించినవా కేసీఆర్ ?
ఉద్యోగులను నమ్మియ్యనీకే బిశ్వల్ కమిటీ వేసి, ఆ కమిటీ ఏం రాయాలే..,ఎంత రాయాలే…,ఒత్తిడి పెంచి ఆ రిపోర్ట్ రాపించారు.ఫిట్ మెంట్ 7.5 % ఇచ్చి HRA 6 % తగ్గించటం దారుణం, మోసం అని ఆవేదన వ్యక్తంచేశారు.

ఇచ్చినట్లే ఇచ్చి గుంజుకున్నవ్, ఉద్యోగుల ను మోసం చేసినవ్. 7.5% PRC ఇచ్చి CPS 10% తగ్గిస్తారు. 30 శాతం ఉన్న సి.పి.ఎస్ ఉద్యోగికి ఈ పి.అర్.సి ద్వారా జీతం పెరగదు. పైగా 2.5 శాతం జీతం తగ్గుతది.
31 నెలల నుంచి ఉద్యోగులు ఎదురుచూస్తుంటే వాళ్లకు ఇచ్చేది ఇదా అని ప్రభుత్వని ప్రశ్నించారు.

ఉద్యోగులు డిమాండ్ చేసినట్లు 43 శాతం ఫిట్ మెంట్ ఇయ్యాలి. ఉన్న ఉద్యోగులు మన జనాభా కు సరిపోయినట్లు వున్నారా ?
జనాభా ప్రాతిపదికన లేరు. ఉద్యోగులపై పని భారం పెరిగింది. ఇంకా కమిటీలు, రిపోర్ట్ లు అని కాలయాపన చేయకుండా ఖాళీలు భర్తీ చేయాలి అని డిమాండ్ చేశారు బండి సంజయ్.

ఇంత దారుణమైన, అతి తక్కువ ఫిట్మెంట్ ను సమైక్య పాలకులు కూడా ఇవ్వలేదు.సమైక్య పాలకులు 25% కంటె తక్కువ ఫిట్ మెంట్ ఎప్పుడు ఇవ్వలేదు.పి.అర్.సి వేసిన వెంటనే ఐఅర్ ఇవ్వడం సంప్రదాయం.కానీ,ఈ సర్కార్ ఐఅర్ కూడా ఇవ్వలేదు.ఇంటి కిరాయిలు విపరీతంగా పెరుగుతుంటే హెచ్అర్ఏ తగ్గించాలని అనుకోవడం మూర్ఖత్వం అని మండిపడ్డారు సంజయ్.

Have your say

four + 18 =