చనిపోయిన కోడికి కరోనా పాజిటివ్

Author: Share:

కరోనా బారిన పడకుండా చికెన్, గుడ్లు తినాలి అని వాటితో శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుందని డాక్టర్లు చెప్తున్నారు. కానీ మనం తినే కోళ్లకు కరోనా వస్తే ఎట్లా ? ఆశ్చర్య పోకండి మీ అనుమానం నిజమే కోళ్లకు కరోనా సోకింది ఈ ఘటన కరోనా పుట్టిల్లులైన చైనాలో వెలుగులోకి వచ్చింది.

చైనాలో చచ్చిన కోడికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో చైనా తో పాటు ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది ఎం తినాలో తెలియని పరిస్థితిలో ప్రజలు బయన్దోళనలు పడుతున్నారు. చచ్చిన కోడి ద్వారా ఇంకెన్ని కోళ్లకు కరోనా వ్యాప్తి చెందిందోనని చైనా అధికారులు ఆందోళన చెందుతున్నారు. చచ్చిపోయిన కోడి రెక్కల ముక్కలకు ( వింగ్స్) కరోనా పరీక్షలు నిర్వహించగా దానికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

ఈ కోళ్లు బ్రెజిల్ నుంచి దిగుమతి అయ్యాయని చైనా లోని షాన్డాంగ్ ప్రావిన్స్ అధికారలు తెలిపారు. బ్రెజిల్‌లోని దక్షిణ ప్రాంతంలోని సాంతా కాటరీనా అనే ప్రాంతంలోని అరోరా అలిమెంటోస్ ప్లాంట్ నుంచి ఈ చికెన్ వచ్చినట్టు గుర్తించారు. అప్రమత్తమైన అధికారులు ఈ చికెన్‌ను పట్టుకున్నవారికి కూడా కరోనా పరీక్షలు చేయగా వారికి ఎలాంటి కరోనా లక్షణాలు లేవు అని తెలిపారు.

ఫ్రోజెన్ ఫుడ్స్ కొనేటప్పుడు జాగ్రత్త వహించాలని స్థానిక ప్రభుత్వం వినియోగదారులను హెచ్చరించింది. మాంసం దిగుమతి చేసుకునే సమయంలో సరైన చర్యలు చేపట్టాలని అధికారాలను కోరారు.

READ  రవీంద్ర భారతి వద్ద ఆత్మహత్యయత్నం కలకలం
Previous Article

శ్రీరాముడిపై అస‌భ్య‌క‌ర పోస్టులు, క‌త్తి మ‌హేష్ అరెస్ట్

Next Article

అమరావతి కథలు : ఆంధ్ర రాజధాని అమరావతి పిన్ కోడ్ ఏంటి ?

You may also like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

5 − two =