కోవిడ్19 – తెలంగాణకు రూ.2,719 కోట్లు ఇచ్చాం: కిషన్ రెడ్డి

Author: Share:

లాక్ డౌన్సమయంలో దేశ ప్రజలను ఆదుకునేందుకు కేంద్రం చేపట్టిన గరీబ్ కల్యాణ్ యోజన కిందతెలంగాణకు  రూ.2,719 కోట్లు ఇచ్చినట్లు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఆ పథకం కింద పేదలతోపాటు వివిధ వర్గాల వారికి కేంద్ర సహకారం అందిందని చెప్పారు. 

ప్రధాన మంత్రి కిసాన్ యోజన కింద రాష్ట్రంలోని రైతుల ఖాతాల్లో రూ. రెండు వేల చొప్పున జమ య్యాయని,  ఇందుకు కేంద్రం రూ.658 కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు. జన్ ధన్ అకౌంట్లు కలిగిన మహిళల కోసం రూ.263 కోట్లు, స్టేట్ డిజాస్ట ర్ నిధుల కింద రూ.224 కోట్లు, ఉద్యో గుల ఈపీఎఫ్ నిధులకు రూ.207 కోట్లు, భవన నిర్మాణ కార్మికుల కోసం రూ.126 కోట్లు ఖర్చు చేశామని వివరించారు. 

రాష్ట్రంలో కరోనా ప్రత్యేక హాస్పిట ళ్లు, వైద్య పరికరాల కోసం మరో రూ.215 కోట్లు ఇచ్చామని కిషన్ రెడ్డి తెలిపారు. వీటికి తోడు రాష్ట్రానికి రూ. 982 కోట్ల డెవల్యూషన్ ఫండ్ ను కేంద్రం విడుదల చేసిందని పేర్కొన్నా రు. ఉచిత గ్యాస్ సిలిండర్లు, వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు కేంద్రం పింఛన్లు అందిస్తోందని వెల్లడిం చారు. 

రాష్ట్రానికి 27,500 పీపీఈ కిట్లు, లక్ష ఎన్ – 95 మాస్క్ లు అందజేశామని కేంద్ర మంత్రి తెలిపారు. తెలంగాణలో కరోనా టెస్టుల కోసం 8 ప్రభుత్వ, 12 ప్రైవేటు ల్యాబ్ లకు అనుమతి ఇచ్చామని తెలిపారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసిన ఉచిత బియ్యం లో కేంద్రం వాటా ఉందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. 

READ  రోజుకు 40 వేల టెస్ట్ చేస్తామన్నారు కేసీఆర్, కానీ 24 వేలు కూడా దాటడం లేదు

కేంద్రం ప్రతి ఒక్కరికీ ఐదు కిలోల చొప్పున బియ్యం ఇస్తోందని చెప్పారు. రాష్ట్ర సర్కారు ఏప్రిల్ నెలకుగాను 98,810 టన్నుల బియ్యాన్ని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ సీఐ) నుంచి ఇస్తుందని తెలిపారు. రెండో విడత కేంద్ర సహాయం కూడా వస్తోందని చెప్పారు. 

Source
Nijam.org

Previous Article

True Indology busts fake claims made by Javed Akhtar about Alauddin Khilji

Next Article

గల్ఫ్ దేశాల నుంచి తబ్లీగ్ జమాత్ పెద్దలకు కోట్లాదిరూపాయల నిధులు

You may also like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

nineteen − 15 =