మురుగునీటిలో కరోనా వైరస్‌ ఆనవాళ్లు : సీసీఎంబీ, ఐఐసీటీ సంయుక్త పరిశోధన

Author: Share:

హైదరాబాద్ నగర్ ప్రజలకు సీసీఎంబీ మరో చేదు వార్త తెలిపింది.

కరోనా బాధితుడు దగ్గినప్పుడు, తమ్మినప్పుడు.. తప్పర్ల ద్వారా కరోనా రోగికి దగ్గరగా ఉన్నప్పుడు వ్యాధి విస్తరిస్తుంది అని మనం విన్నాం.

ముక్కు, నోటి ద్వారానే కాకుండా మలమూత్ర విసర్జనలోనూ వైరస్ వ్యాప్తి జరుగుతుందని తాజా పరిశోధనల్లో తేలింది.

నగరంలోని మురుగు నీటి నుండి సేకరించిన నీటిలో కరోనా వైరస్ ఉన్నట్లు గుర్తించామని సీసీఎంబీ డైరెక్టర్ రాకేష్ మిశ్రా తెలిపారు.

నాలాల్లోని మురుగు నీటి ద్వారా కూడా ఇప్పుడు వైరస్ వ్యాపించే అవకాశం ఉందని హెచ్చరించారు.

మలమూత్ర విసర్జనలోనూ వైరస్ ఉంటుందని, వ్యాధి సోకిన 35 రోజుల వరకు పేషెంట్ శరీరంలో వైరస్ ఉండే అవకాశం ఉందని సీసీఎంబీ, ఐఐసీటీ సంయుక్త పరిశోధనల్లో తేల్చిచెప్పింది.

Previous Article

వరంగల్‌ : కాకతీయుల నినాదం 3T ‘ట్యాంక్‌’,’టెంపుల్’‌, ‘టౌన్‌’

Next Article

శ్మశానాల కబ్జాలను కూడా పట్టించుకోని వక్ఫ్‌‌బోర్డు, హైకోర్టు ఆగ్రహం

You may also like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

thirteen − 1 =