డా శ్యామా ప్రసాద్ ముఖర్జీ – భారతీయ జనసంఘ్ ఆవిర్భావం

Author: Share:

ఏక్ దేశ్ మే దో విధాన్ దో ప్రధాన్ ఔర్ దో నిషాన్ నహీ చ లేగీ , నహీ చలేగీ (ఒక దేశంలో రెండు రాజ్యాంగాలా? ఇద్దరు అధ్యక్షులా? రెండు జాతీయ పతాకాలా? ఇది చెల్లదు కాక చెల్లదు) అని దిక్కులు పెక్కటిల్లేలా భారత కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా జాతీయ వాద దేశభక్తి దేశం కోసమే భారతీయ జనసంఘ్ ను 1951 అక్టోబర్ 21 న స్థాపించిన పుణ్యపురుషుడు మన స్వర్గీయ శ్రీ శ్యామా ప్రసాద్ ముఖర్జీ

జన్మించింది దేశ భక్తులు కు పురుడుపో‌సిన బెంగాల్ లో 1901 జులై 6 న ప్రముఖ విద్యావేత్త, దేశభక్తుడు అయిన సర్ అసతోష్ ముఖర్జీ , జోగ మాయా దేవి ముఖర్జీ పుణ్య దంపతులకు జన్మించారు ముఖర్జీ తండ్రి కలకత్తా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా, కలకత్తా హైకోర్టు జడ్జిగా, బాధ్యత లు నిర్వహించారు తండ్రి బాటలోనే నడుస్తూ శ్యాం ప్రసాద్ ముఖర్జీ గారు కూడా చాలా ప్రతిభావంతుడు కావడంతో కేవలం 33 సంవత్సరాల వయస్సు లో నే కలకత్తా యూనివర్సిటీ కి వైస్ ఛాన్సలర్ గా బాధ్యతలు నిర్వహించి దేశంలోనే యూనివర్సిటీ ల చరిత్రలో అతిచిన్న వయస్సున్న వ్యక్తి గా చరిత్ర సృష్టించారు

1922 ఏప్రిల్ 16 న సుధా దేవి తో శ్యాం ప్రసాద్ ముఖర్జీ వివాహం జరిగింది వారికి ఐదుగురు సంతానం లో చివరి కుమారుడు అనారోగ్యం కారణంగా మరణించగా తర్వాత ముఖర్జీ భార్య సుధా దేవి 1933 లో మరణించారు తర్వాత ఆ నలుగురు పిల్లలను ముఖర్జీ వదిన గారు వారి పిల్లలతో సమానంగా పెంచడం జరిగింది ఆ తర్వాత ముఖర్జీ గారు మల్లీ పెళ్లి చేసుకోవడానికి నిరాకరించారు

ఆతర్వాత ఆయన పూర్తి స్థాయి రాజకీయ జీవితం లోకి వచ్చాడు ఆతర్వాత బెంగాల్ విభజన, ముస్లిం లీగ్ మతతత్వ రాజకీయాలు ఇవన్నీ ముఖర్జీ ని ఆందోళన కు గురిచేసింది ఇదే సమయంగా జాతీయ వాద రాజకీయాల్లో ప్రవేశించారు కానీ సమస్యలు పరిష్కారం లో ఎలాంటి మత వైఖరిని అవలంబించే వారు కాదు ఆయనకు బెంగాల్ లో అనేకమంది మేధావులు లతో సత్సంబంధాలు ఉండేవి ఈయన 1939 లో వీర సావర్కర్ ఆధ్వర్యంలో హిందూ మహా సభకు తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్నారు సమైక్య భారతావని కి సంపూర్ణ, సత్వర స్వాతంత్య్రం సాధించడమే తమ పార్టీ లక్ష్యంగా ప్రకటించారు వీరు మహాత్మా గాంధీ కి అత్యంత సన్నిహితులు ‘పటేల్ హిందూ మనస్తత్వం గల కాంగ్రెస్ వాది మీరు కాంగ్రెస్ మనస్తత్వం గల హిందూ సభ సభ్యులు’ అని ప్రశంసించారు గాంధీ జి స్వాతంత్య్ర తరువాత నెహ్రూ తొలి మంత్రి వర్గంలో గాంధీజీ బలవంతం మీద నే ముఖర్జీ కి స్థానం కల్పించారు ఆయన ప్రధమ పరిశ్రమల శాఖ మంత్రి గా అనేక పెద్ద సంస్థలు స్థాపించారు

నెహ్రూ క్యాబినెట్ లో ఉన్నప్పటికీ ముఖర్జీ కి ప్రధాని తో కాశ్మీర్ విషయం లో విభేదించారు 1950 లో పాకిస్తాన్ ప్రధాని లియాఖత్ అలీఖాన్ తో నెహ్రు ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు తూర్పు పాకిస్తాన్ లో హిందువుల ప్రయోజనాలకు విఘాతం కలిగించింది అని ఆవేదన వ్యక్తంచేశారు ఈ విషయం, లో హిందువుల హక్కులకు తీవ్ర అన్యాయం చేశారు అని తన మంత్రి పదవికి రాజీనామా చేశారు 1950 ఏప్రిల్ 19న ఆయన జాతిని ఉద్దేశించి పార్లమెంటు లో ప్రసంగించి భారత దేశ చరిత్ర లో ఒక గొప్ప రాజకీయ ప్రసంగం గా భావించి “పార్లమెంట్ కేసరి” అన్న బిరుదు సొంత చేసుకున్నారు

నెహ్రూ క్యాబినెట్ నుంచి తప్పుకున్నాక ఒక సరైన జాతీయ వాద వేదిక ను ఏర్పాటు చేయాలని ఒక సమాన జాతీయ వాద ప్రజాస్వామ్య వేదికను ఏర్పాటు చేసి “భారతీయ జనసంఘ్” అని పేరు పెట్టారు అదే సమయంలో ఆర్ ఎస్ ఎస్ కూడా ఇదే ఆలోచన తో ఉన్నందువల్ల మహాత్మా గాంధీ హత్య నేపథ్యంలో ఆర్ ఎస్ ఎస్ ను రాజకీయ దురుద్దేశంతో నిషేదించడంతో అప్పటి సర్ సంఘ్ చాలక్ గురూజీ మొదటి అంగీకరించక పోయినా తర్వాత అనుకూలంగా స్పందించడంతో ఈ కొత్త పార్టీ ఏర్పడింది ఏ పార్టీ అయినా పురోగతి సాధించాలి అంటే దృఢ అభిప్రాయాలు ఉన్న వ్యక్తులు అవసరం అందుకే సంఘ్ నుంచి సమర్థవంతమైన వ్యక్తులు పండిత్ దీనదయాల్ ఉపాధ్యాయ, మరికొందరు పార్టీ కి సహకరించడం జరిగింది అప్పుడు పార్టీ గుర్తు దీపం అంటే చుట్టూ ఉన్న చీకటిని పారద్రోలి జ్ఞానాన్ని అందించే ప్రకాశం ఆ తర్వాత జనసంఘ్ లో అనేకమంది మేధావులు చేయడం జరిగింది అందులో ప్రముఖులు మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీ అటల్ బిహారీ వాజపేయి , లాల్ కృష్ణ అద్వానీ జి

1953 లో భారతీయ జనసంఘ్ మొదటి ప్లీనరీ కాన్పూర్ లో జరిగింది అందులో జమ్మూకాశ్మీర్ పైన తీర్మానం చేసి జమ్మూ కాశ్మీర్ ని భారత దేశంలో విలీనం చేయాలని ఒక దేశంలో రెండు రాజ్యాంగాలు, ఇద్దరు అధ్యక్షులు, రెండు జెండాలు ఉండొద్దు అని జమ్ముకాశ్మీర్ లో త్రివర్ణ పతాకాన్ని సగౌరవంగా ఎగరవేద్దాం అని ప్రకటించారు 1953 మే 11 న ముఖర్జీ గారు ఎలాంటి అనుమతులు లేకుండా కాశ్మీర్ లోకీ ప్రవేశించారు అని జమ్ముకాశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారు వారితో పాటు అనేక మంది కార్యకర్తలు అరెస్టు అయ్యారు ఆయనను శ్రీనగర్ లో గృహనిర్బంధ చేయడంతో ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు 1953 జూన్ 23 న అనుమానాస్పద స్థితిలో మరణించారు ఈయన పోలీసుల అదుపులో ఉండి మరణించడం పై ఆయన తల్లి ప్రధానికి లేఖ రాశారు కానీ ఎలాంటి విచారణ జరుపలేదు కాగా ముఖర్జీ గారు అమరులైన కొద్ది రోజులకే ప్రభుత్వం పర్మిట్ వ్యవస్థ ను రద్దు చేసింది జమ్మూకాశ్మీర్ లో ప్రత్యేక ప్రధాని హోదాను కూడా రద్దు చేసింది కానీ 370 అధికరణ లో ఉన్నట్లు రెండు రాజ్యాంగాలను మాత్రం రద్దు చేయలేదు ఆతరువాత 2004 లో అప్పటి ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజపేయి గారు ముఖర్జీ గారిది సహజ మరణం కాదు నెహ్రూ దుర్మార్గం గా హత్య చేయించాడని చెప్పడం ఇంకా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దీనిపై విచారణ చేపట్టి నిజాన్ని ప్రజలముందు ఉంచాల్సిన బాధ్యత ప్రస్తుత గవర్నమెంట్ పైన ఉంది ఆయన జననం ఒక అద్భుతం ఆయన మరణం జాతిహితం అందుకే ఈ విధంగా అంటారు

“జహా హుయే బలిదాన్ ముఖర్జీ ఓ కాశ్మీర్ హమారా హై ” ఎక్కడైతే ముఖర్జీ గారు అమరులైనారో ఆ కాశ్మీరం మాది భారత దేశానికి అని వారు మరణించిన వారి ఆదర్శాలను ఆశయాలను సాధించే దిశగా భారతీయ జనతా పార్టీ అను నిత్యం పోరాడుతూనే ఉంది

Author
Hyndavi Reddy
– Twitter – @Hyndavireddy5

Previous Article

50,000 Made in India Ventilators under PM CARES Fund to fight COVID-19

Next Article

Ratha Yatra Should not be Stopped!

1 Comment

  1. వారి గురించి రాయాలంటే పదాలు సరిపోవు పేజీలు సరిపోవు నాకున్న అభిమానం తో ఒక జాతీయవాది గా నాకున్న పరిజ్ఞానం తో రాసాను అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను 🙏🙏🚩🚩 ✊

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

four × one =