Latest

దుబ్బాక ఉప ఎన్నిక సమరం

దుబ్బాక నియోజకవర్గపు తెరాస ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణంతో ఆ స్థానం ఖాళీ అయిన విషయం అందరికీ తెలిసిందే.
జరగబోయే ఉప ఎన్నికల్లో తెరాస అభ్యర్థిగా దివంగత మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి భార్య సుజాత పోటీ చేస్తుంటే; బీజేపీ నుంచి రఘునందన్ రావు, కాంగ్రెస్ నుంచి చెరుకు శ్రీనివాస్ రెడ్డి కూడా బరిలో ఉన్నారు.
నవంబర్‌ 3వ తేదీన పోలింగ్ నిర్వహించి, నవంబర్‌ 10వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

దుబ్బాకలో అసెంబ్లీ సీట్ నిలుపుకోవడం కోసం తెరాస; మరో వైపు గెలిచి సత్తా చాటడానికి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తలపడుతున్నాయి. తెరాసకు రామలింగారెడ్డి మరణంతో సానుభూతి ఉంది కనుక గెలుపు మీద అధికార పార్టీ ధీమాగా ఉంది. కేవలం మెజారిటీ పెంచుకోవడానికే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ ఎన్నికల బాధ్యతలను కేసీఆర్ హరీష్ రావుకి అప్పగించారు. హరీష్ రావు ప్రతి గ్రామం తెరాసకు ఓటు వేసేలా ప్రచారం చేస్తున్నారు.

దుబ్బాకలో మొత్తం ఏడు మండలాలు ఉంటే; అందులో రెండు మెదక్ లో, ఐదు సిద్దిపేట లో ఉన్నాయి.

బీసీ ఓటర్లు అధికంగా ఉన్న నియోజకవర్గం దుబ్బాక. రెడ్లు కూడా ఇక్కడ ఒక బలమైన సామాజిక వర్గం కావడంతో తెరాస రామలింగారెడ్డి భార్యకి, కాంగ్రెస్ చెరుకు శ్రీనివాసరెడ్డికి సీట్ కేటాయించారు.

తెరాస నాయకులు గెలుపు మీద ధీమాగా ఉన్నప్పటికీ, అనేక సమస్యలు కూడా వారిని వెంటాడుతున్నాయి.

  • • మోదీ ప్రభుత్వం ఇచ్చిన 10% EWS రిజర్వేషన్లు తెలంగాణ ప్రభుత్వం అమలు చేయలేదు. బీజేపీ ప్రజలకు ఇది అర్ధమయ్యే విధంగా చెప్తే ఫలితం ఉండచ్చు.
  • 10% EWS అమలు చేయని కేసీఆర్ కు రెడ్లు ఎందుకు ఓటు వెయ్యాలి?
  • • దుబ్బాక రోడ్లు పరిస్థితి దయనీయంగా ఉంది. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల హామీనీ తెరాస ఇప్పటికీ నిలుపుకోలేదు.
  • • మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ కి భూములు ఇచ్చిన దుబ్బాక రైతులకు తెరాస ప్రభుత్వం నుంచి ఆశించినంత సహాయం అందలేదు.
  • • సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ నియోజకవర్గాలకు వచ్చినంత ప్రభుత్వ నిధులు దుబ్బాకకు రాలేదు.
  • • యువత ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లి, అక్కడ చాలా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.
  • • దుబ్బాకలో నిరుద్యోగం చాలా పెద్ద సమస్య. బీడీ కార్మికుల సమస్యకు తెరాస ప్రభుత్వం ఇంకా పరిష్కారం చూపలేదు.

2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తెరాస ప్రభుత్వం డబ్బుతో కొనేసింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకు ఓటు వేసి, వారి అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే కూడా అధికార పార్టీ తెరాస వాళ్ళు ఎప్పుడైనా కొనెయ్యచ్చు. అందుకే దుబ్బాకలో కాంగ్రెస్ కు ఓటు వేయడం వృధా అని ప్రజలు భావించచ్చు.

2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు దుబ్బాకలో రెండవ స్థానం వచ్చింది.
ధర్మం కోసం, సమాజం కోసం బీజేపీ రఘునందన్ రావును అసెంబ్లీకి పంపాలనుకుంటుంది.
దుబ్బాకలో తెరాస గెలిస్తే 1 ఎమ్మెల్యే సంఖ్య పెరుగుతుంది అంతే; కానీ రఘునందన్ రావు గెలిస్తే అసెంబ్లీలో ప్రజా గొంతు అవుతారు.

రఘునందన్ రావు ఈ ఉప ఎన్నికల్లో గెలవడం అంత సులభం కాదు.
కానీ, 2012 లో మహబూబ్ నగర్ సిట్టింగ్ ఎమ్మెల్యే మరణం తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెరాస పై ఘనవిజయం సాధించారు.

దుబ్బాకలో అలాంటి పరిస్థితి మరలా పునరావతం కాబోతుందా? అనేది ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న!

Author
Naveen Surya

Have your say

17 + five =