హిందూ మృతదేహానికి ముస్లింలు అంత్యక్రియలు చేసిన దాంట్లో నిజం ఎంత?

Author: Share:

ఒక వైపు ప్రజలంతా కరోనా మహమ్మారితో అతలాకుతలమై ఉన్న సమయంలో ఒక వర్గం వారు సామాజికంగా ఒంటరి వారవుతుంటే, తామేదో వచ్చి నిలబడ్డామని అంటూ అపోహాలు కలిగించే వార్తా కథనాలను వ్యాపింప చేయడం ద్వారా ప్రజలలో సానుభూతి పొందే ప్రయత్నం స్వయంగా ఆమ్ ఆద్మీ పార్టీ నేత ఒకరు హైదరాబాద్ లో చేశారు. 

ఈ సందర్భంగా పలు అపోహాలు కలిగించే వార్తా స్వయంగా వైరల్ చేశారు. ఒక హిందూ మృత దేహాన్నికి ఇంటి చుట్టుపక్కల వారు నిరాదరిస్తే,  ఐదుగురు ముస్లింలు వచ్చి దగ్గరుండి అంత్యక్రియలు జరిపించారని అంటూ గత వారం కొన్ని ప్రముఖ దినపత్రికలలో వార్తాకథనాలు వచ్చేటట్లు చేశారు. 

ఆ కధనాల ప్రకారం ఖైరతాబాద్ సమీపంలోని ఆనంద్ నగర్ లో నివాసం ఉంటున్న రిక్షా కార్మికుడు వేణు ముదిరాజ్ (50) ఉస్మానియా ఆసుపత్రిలో అనారోగ్యంతో  గురువారం మృతి చెందారు. రెండేళ్లక్రితం భార్య చనిపోగా ఇంట్లో ఇద్దరు పిల్లలు మాత్రమే ఉన్నారు. సమీపంలో అతని సోదరుడు ఉన్నారు. 
మిగిలిన బంధువులు, స్నేహితులు దూరంగా ఉండడంతో లాక్ డౌన్ కారణంగా రాలేక పోయారు. అయితే అతను కరోనాతో చనిపోయారని అనుమానంతో మృతదేహాన్ని ఇంటికి తీసుకు రావడానికి ఆ ప్రాంతంలోని వారెవ్వరూ  ఇష్టపడలేదని, పైగా అంత్యక్రియలకు కూడా ఎవ్వరు సహకరింపలేదని అంటూ ఆ వార్తాకథనంలో పచ్చి అబద్దాన్ని వైరల్ చేసారు. 

ఆ సమయంలో ఆప్ నేత మొహమ్మద్ మజీద్ సారధ్యంలో ఐదుగురు ముస్లిం యువకులు ముందుకు వచ్చి, దగ్గరుండి, తామే అంత్యక్రియలు జరిపించారని ఆ వార్తాకథనం సారాంశం.  ఈ వార్తాకథనాలు చూసి అతని కుటుంభం సభ్యులు విస్తుపోయారు. వాస్తవానికి లాక్ డౌన్ కారణంగా అతి తక్కువ సంఖ్యలో దగ్గిరి కుటుంబ సభ్యులు, స్థానికంగా ఉన్న బందువులు మాత్రమే హాజరై అంత్యక్రియలు నిర్వహించారు. 

దారిలో వారొచ్చి తాము కూడా ఒక చేయి వేస్తామని కొద్దీ క్షణాలు మృతదేహం గల పాడెను మోసి, ఫోటో తీసుకొని వెళ్లిపోయారని చెబుతున్నారు. ఈ వార్తల గురించి ఫోన్ చేసి వారిని కుటుంభం సభ్యులు మరుసటి రోజు నిలదీస్తే ఆప్ నేత నీళ్లు నమిలారు. ఆ వార్త, ఫోటోను మీడియాకు ఇచ్చింది తానే అని ఒప్పుకొంటూనే కానీ ఆ విధంగా ఇవ్వలేదని పొంతనలేని సమాధానం ఇచ్చే ప్రయత్నం చేసాడు. 

Media houses published this false story that Majid and friends as heroes as Hindu neighbour shunned their own. KTR has quoted this false story, praised those menand given Ganga Jamuna Tehzeeb colour.

కరోనాతో చనిపోయారని అనుమానంతో శవం ఇంటివద్దకు తీసుకు రావద్దని ఇరుగు, పొరుగు అభ్యంతరం వ్యక్తం చేయడం కూడా పచ్చి అబద్దం అతని కుటుంభం సభ్యులు స్పష్టం చేస్తున్నారు. అయితే తాము అంత్యక్రియలు జరిపించలేదని, కేవలం కొద్దిసేపు మాత్రమే ఉన్నామని ఆప్ నేత అప్పటికే జరగవలసిన నష్టం జరిగిపోయింది. 

నిజంగా కరోనాతో చనిపోయాడా అనే అనుమానాలను వ్యాపింపచేసిన్నట్లు అయింది. ఇప్పుడు కుటుంభం సభ్యులు వారిని ఫోన్లో నిలదీసిన ఆడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారుతున్నది. కరోనా అనుమానంతో ఆ కుటుంబాన్ని ఇరుగు, పొరుగు వారు సాంఘిక బహిష్కరణ చేసిన్నట్లు అపోహా కలిగించి, తామేదే వచ్చి ఆడుకున్నామన్నట్లు మతం రంగు పూసి ఆమ్ ఆద్మీ పార్టీ నేత తప్పుడు వార్తాకథనాలు వ్యాప్తి చేస్తూ దొరికిపోయారు.

Source:
Nijam.org portal

Previous Article

The Big Oil Crash and What India Should Do Now ?: Sanju Verma

Next Article

Fact Check: No, Muslim men did not do last rites of a Hindu. KTR quotes false story from print media says Ganga Jamuna Tehzeeb

You may also like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

eleven + three =