తెలుగు

కెపిహెచ్బి లో దారుణం, కొడుకు సరిగ్గాచదవడం లేదని నిప్పంటించిన తండ్రి

తరచూ టీవీ చూస్తూ సరిగ్గా చదవడం లేదంటూ కోపం పెంచుకున్న ఓ తండ్రి ఏకంగా కన్న కొడుకు పై టర్పెంట్ ఆయిల్ పోసి నిప్పంటించాడు. కన్న తండ్రి చేసిన ఘాతుకానికి కొడుకు చావు బతుకుల మధ్య హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతున్నాడు. దారుణమైన ఈ సంఘటన కేపీహెచ్బీ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కేపీహెచ్బీ కాలనీ రోడ్ నెంబర్ 2 లో వాచ్మెన్ గా పనిచేస్తున్న రతలవత్ బాలు భార్య నలుగురు పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. ఇద్దరు కుమార్తెలు ఇద్దరు కొడుకుల్లో చిన్నవాడైన చరణ్ (6) స్థానికంగా ఉండే ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. కాగా ఆదివారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చిన బాలు ఇంట్లో టీవీ చూస్తున్న చరణ్ను వీడి కట్ట తీసుకురావాల్సిందిగా బయటికి పంపించాడు. బయటనుంచి వచ్చిన చరణ్ తండ్రికి బీడీ కట్ట ఇచీ తిరిగి టీవీ చూస్తూ ఉండగా కోపంతో ఊగిపోయిన బాలు కొడుకును తీవ్రంగా కొట్టాడు. సరిగ్గా చదువుకోకుండా తరచూ టీవీ చూస్తున్నావంటు తీవ్రంగా కొట్టడమే కాకుండా పక్కనే టర్పెంట్ ఆయిల్ పోసి అగ్గిపెట్టె తో నిప్పంటించాడు. దీంతో చరణ్ కు తీవ్ర గాయాలు కావడంతో తల్లి వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించింది. దాదాపు 60 శాతం గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలియజేశారు. కొడుకుకు నిప్పంటించిన తండ్రి బాలు పై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలియజేశారు.

Have your say

3 + eighteen =