వరంగల్ లో ఫ్లెక్సీ రగడ

Author: Share:

హన్మకొండ: 39వ డివిజన్ లో కొత్త రకం రాజకీయం నడుస్తోంది. బ్రమ్మనవాడలో సోనియాగాంధీ పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ నాయకులు సందుపట్ల ధనురజ్, మాజీ సిటీ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు, నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా డిసెంబర్ 9న అన్నదానం ఉన్నది అని తెలుపుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని అధికారపార్టీకి చెందిన కొంతమంది నాయకులు ప్రభుత్వ అధికారులకు చే చింపించారు అని 39వ డివిజన్ ప్రజలు అనుకుంటున్నారు అని తెలిపారు.

ఈ ఫ్లెక్సీ లో సోనియాగాంధీ నుంచి మొదలుకొని మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ దంపతులు మరియు జిల్లా స్థాయి నేతల ఫోటోలు ఉన్నాయి.

అధికారిక పార్టీకి చెందిన నాయకుల ఫ్లెక్సీలు రోజులు తరబడి ఉన్న పాటించుకొని అధికారులు కేవలం కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఫ్లెక్సులను మాత్రం కావాలనే టార్గెట్ చేస్తున్నారు అని మండిపడ్డారు సందుపట్ల ధన్ రాజ్

ఇలాంటి నీచమైన రాజకీయాలు చేసేవారికి తగిన బుద్ధి చెప్తామ్ అని హెచ్చరించారు ధన్‌రాజ్. అధికారాలు కూడా అధికార పార్టీ కార్పొరేటర్లకు వత్తాసు పలకడం సరికాదు ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి అని గుర్తు ఉంచుకోవాలియని తెలిపారు. ఈ ఘటన ను రాష్ట్ర స్థాయి నాయకత్వం వరకు తీసుకెళ్తామని తెలిపారు ధన్ రాజ్.

ఇలాంటి రౌడి రాజకీయం 39 డివిజన్ లో జరగడం చాలా దురదృష్టకరం దీన్ని తీవ్రంగా కండిస్తున్నా అని తెలిపారు 39 డివిజన్ అధ్యక్షులు శ్రీరామోజు నాగ సోమేశ్వర.

Previous Article

Decoding the so-called Farmers Protest or Brokers Protest ?

Next Article

India wins the Investment Promotion Award 2020!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

three × 3 =