తెలంగాణలో హైకోర్టు కీల‌క సూచ‌న‌లు

Author: Share:

క‌రోనా సంద‌ర్భంగా లాక్ డౌన్, క‌ర్ఫ్యూ వంటి క‌ఠిన‌మైన నిబంధ‌న‌లు ఎందుకు పెట్ట‌డం లేద‌ని రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ప్ర‌శ్నించింది. ఎటువంటి నిర్ణ‌యం తీసుకోబోయేది త‌మ‌కు తెలియ‌ప‌రచాల‌ని స్ప‌ష్టం చేసింది. లేదంటే తామే నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంటుంద‌ని హైకోర్టు పేర్కొంది.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు మరోసారి విచారణ జరిగింది. 10 రోజుల క్రితం ఆదేశాలిస్తే ఇప్పటి వరకు ఎందుకు అమలు చేయలేదని హైకోర్టు ప్రశ్నించింది.

తెలంగాణలో స్కూల్స్ మూసివేశం, మత ర్యాలీలు నిషేధించామని ప్ర‌భుత్వ న్యాయ‌వాది పేర్కొన్నారు. పెళ్లిళ్లు,చావులు, పార్టీలు, ఎన్నికల ర్యాలీలపై ఎలాంటి ఆంక్షలు పెట్టారని హైకోర్టు ప్రశ్నించింది.

ఇష్టానుసారంగా రాజకీయ ర్యాలీలు చేయడమేంటని హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఉన్న‌తాధికారులు ఇచ్చిన నివేదిక స‌మ‌గ్రంగా లేద‌ని అభిప్రాయ ప‌డింది. విచార‌ణ ను ఈ నెల 23కు వాయిదా వేసింది.

Source
Nijamtoday

Previous Article

India becomes fastest country to administered more than 13cr doses of vaccine

Next Article

Modi : Key decisions taken to Liberalise and Accelerate Phase 3 of Covid-19 Vaccination from 1st May

You may also like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

sixteen − eleven =