బీజేపీకి కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ – ఓపిక నశిస్తే ప్రధాని మోదీతో సహా ఎవరినీ వదిలిపెట్టబోనని హెచ్చరించారు.

Author: Share:

బుధవారం(అక్టోబర్ 28) హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో మంత్రి కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు.

దుబ్బాక ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ గతం కంటే ఎక్కువ మెజారిటీతో గెలవడం ఖాయమన్నారు మంత్రి కేటీఆర్. కచ్చితంగా ప్రజలు మరోసారి టీఆర్ఎస్‌కే పట్టం కడుతారని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

కాంగ్రెస్, బీజేపీ డిపాజిట్ కోల్పోయినా ఆశ్చర్యం లేదన్నారు. బీజేపీది వట్టి డొల్ల ప్రచారమని, ఉన్నది లేనట్లు చూపెట్టడం ఆ పార్టీకి అలవాటేనని విమర్శించారు.

సిద్దిపేట పోలీసులపై బీజేపీ నేతలు మాట్లాడిన భాష తీవ్ర అభ్యంతరకరంగా ఉందని దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.

బీజేపీ నేతలు అడ్డగోలు మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర బీజేపీ నేతలను అదుపులో పెట్టుకోవాలని తెలిపారు.

బీజేపీ జనంలో తక్కువ సోషల్ మీడియాలో ఎక్కువ అంటూ విమర్శించారు.

ఓపిక నశిస్తే ప్రధాని మోదీ సహా ఎవరినీ వదిలిపెట్టబోనని హెచ్చరించారు.

Previous Article

లైసెన్స్, రిజిస్ట్రేషన్ లేకుండా ఇంట్లో తయారుచేసిన ఆహార పదార్థాలను అమ్ముతున్నారా? మీకు 5 లక్షల రూపాయల జరిమానా, ఆరు నెలల వరకు జైలు శిక్ష ఉంటుంది.

Next Article

సినీ దర్శకుడు రాజమౌళికి వార్నింగ్ ఇచ్చిన కొమరం భీమ్ మనవడు

You may also like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

1 × one =