తెలుగు

డ్రగ్స్ కేసులోని ఎమ్యెల్యేలు ఎవరో కేసీఆర్ బయటపెట్టాలి

అన్నీ అయిపోయాయి టీఆర్ఎస్ నేతలు ఇక  డ్రగ్స్ దందాపై పడ్డారని పేర్కొంటూ టీఆరెస్ ఎమ్మెల్యేలకు రక్త పరీక్ష చేయించాలని…డ్రగ్స్ కేసులో ఉన్న ఎమ్యెల్యేలు ఎవరో కేసీఆర్ బయట పెట్టాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. మూడేళ్ళ కిందటి డ్రగ్స్ కేసు ఏమైందో కేసీఆర్ చెప్పాలని నిలదీశారు. 

రక్త పరీక్షలకు మేము సిద్ధమని…కేసీఆర్ తో పాటు టీఆరెస్ ఎమ్యెల్యేలు సిద్ధమా అని సవాల్ చేశారు. డ్రగ్స్ కేసులో ఉన్న ఎమ్మెల్యేలపై సీఎం స్పందించకపోవడం సిగ్గు చేటు అని అంటూ డ్రగ్స్ కేసులో ఉన్న ఎమ్మెల్యేలను వెంటనే రాజీనామా చేయించాలని స్పష్టం చేశారు. 

ఇద్దరు ఎమ్యెల్యేలు నాగార్జున సాగర్ లో ప్రచారం చేస్తున్నారట అని పేర్కొంటూ హైదరాబాద్ ను అడ్డా చేసుకుని టీఆరెస్ ఎమ్మెల్యేలు డ్రగ్స్ దందా చేయడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. 50 శాతం బీసీలు ఉన్న రాష్ట్రంలో కేవలం నలుగురు మాత్రమే మంత్రులున్నారని విస్మయం వ్యక్తం చేశారు. 

ఉన్న నలుగురు బీసీ మంత్రులు మేమె ఉద్యమకారులం అని చెప్పుకోవడం సిగ్గుచేటు అని విమర్శించారు. ఒక బీసీ  నాయకుడిని పార్టీ అధ్యక్షుడిగా చేసే దమ్ము కేసీఆర్ కు ఉందా అని ప్రశ్నించారు. కేసీఆర్ నోరు తెరిస్తే వంద కోట్లు .. వెయ్యి కోట్లు అనడం తప్పా.. ఇవ్వరని ఎద్దేవా చేశారు. 

బీసీల పొట్ట కొట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, కుల వృత్తులను దెబ్బ తీసే పార్టీ ఎంఐఎం పార్టీ అని సంజయ్ విమర్శించారు. బీసీలకు జరిగిన అన్యాయంపై మాట్లాడితే బీజేపీని మతతత్వ పార్టీ అంటున్నారని దయ్యబట్టారు.  సీఎం కేసీఆర్ పెద్ద అబద్ధాల కోరని అంటూ గీత కార్మికులను ప్రోత్సహిస్తా అంటూనే పక్కనే డ్రంక్ అండ్ డ్రైవ్ పెడుతున్నారని విస్మయం వ్యక్తం చేశారు.  కుల సంఘాల నాయకులు ఎంపీలు మంత్రులు అయి కేసీఆర్ మోచేతుల నీళ్లు తాగుతున్నారని ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో కోవిడ్ వల్ల ఎంతమంది చనిపోయారో లెక్క ఇవ్వలేదని చెబుతూ టెస్టుల సంఖ్యను తగ్గించి చూపించారని,  మోదీ గారి పిలుపు మేరకు రాష్ట్రంలో బీజేపీ నేతలు కోవిడ్ టైంలో చాలా మంది సేవలు చేశారని కొనియాడారు. 2023 లక్ష్యం చేరే వరకు బీజేపీ కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని పిలుపిచ్చారు. కేవలం గుర్తింపు కోసమే పని చేయొద్దు…ప్రజల కోపం కష్టపడి పని చేస్తే గుర్తింపు వస్తదని హితవు చెప్పారు. 

Source
Nijamtoday.com

Have your say

16 − sixteen =