Latest

Hyderabad: మజ్లిస్ కు మేయర్ పీఠం కట్ట పెడితే హిందువులను ఆలయాలకు వెళ్ళనివ్వరూ

కేసీఆర్ కు బిజెపి అంటే భయం పట్టుకుంది. ఊపర్ షేర్వానీ..అందర్ పరేషానీ అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు. బిజెపిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న కేసీఆర్ ను ప్రమాణం చేసేందుకు భాగ్యలక్ష్మీ ఆలయానికి రమ్మని సవాల్ చేస్తే తోకముడిచాడు.

కేసీఆర్, ఓ వర్గం ఓట్ల కోసం తాపత్రయపడి దారుస్సలాం, మక్కామసీద్ కు వెళ్తాడు. కానీ, హిందూ దేవాలయాలకు రావడానికి మాత్రం సంకోచిస్తారా..? చార్మినార్ వద్దనున్న భాగ్యలక్ష్మీ ఆలయానికి నేను ఎందుకు వెళ్లకూడదు..? అసలు భాగ్యనగర్ అని పేరు వచ్చిందే భాగ్యలక్ష్మి దేవాలయం పేరు మీదే అలాంటి భాగ్యలక్ష్మి గుడి దగ్గరకి ఎందుకు పోకూడదు. అది ఏమన్నా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ లలో ఉందా ? టీఆర్ఎస్ నేతలకి సవాల్ విసురుతున్నా, ఏ గుడికి రమ్మంటారో చెప్పండి. ఎవరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారో, ఎవరు తప్పు చేశారో అందరికీ తెలుసు. వరద సాయంపై ఈసీకి మేం లేఖ రాయలేదు అని మరో సారి స్పష్టం చేశారు సంజయ్.

దుబ్బాక ఎన్నికల సందర్భంగా ఓ ఛానల్ లోగో మార్చి, విషప్రచారానికి దిగారు. లేఖ ఎవరు రాశారు,ఎవరు ప్రింట్ చేశారు అనే అంశంపై విచారణ చేయొచ్చు కదా. చిన్న చిన్న వాటికే దర్యాప్తు జరిపి అరెస్ట్ చేస్తున్న మీరు,ఈ విషయంలో నిర్లక్ష్యం ఎందుకు వహిస్తున్నారు అని ఘాటుగా స్పందించారు.

టీఆర్ఎస్‌కు ఓటు వేస్తే ఎంఐఎంకు వేసినట్లే అని తెలిపారు.

మజ్లిస్ ఎట్లా చెబితే, కేసీఆర్ అలా అడుతున్నారు. హైదరాబాద్‌లో 40 వేలకు పైగా రోహింగ్యాలు వున్నారు. వాళ్లని ఇక్కడ నుంచి పారద్రోలుదామా లేదా..? రోహింగ్యాలను ఓటర్ లిస్ట్‌లోకి చేర్చింది ఎంఐఎం పార్టీనే. వాళ్ల ఓట్లు టీఆర్ఎస్, ఎంఐఎంకు మాత్రమే అని మండిపడ్డారు సంజయ్.

ఉగ్రవాద సంస్థలతో సంబంధం వున్న వ్యక్తులతో సానుకూలంగా వ్యవహరిస్తూ, వాళ్ల ఓట్ల కోసం కక్కుర్తిపడి వాటి ద్వారానే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలవాలని చూస్తున్న మీరు సెక్యులర్ వాదులు..దేశభక్తులా..?
నగరంలో హిందువులను వెల్లగొట్టడమే తెరాస, మజ్లీస్ లక్ష్యమా? అని ఆవేదన వ్యక్తంచేశారు.

రోహింగ్యాల విషయంలో మీరు మాట్లాడినప్పుడు.., 80 శాతం ఉన్న హిందువుల గురించి మేం మాట్లాడితే తప్పా అని ప్రశ్నించారు.

బాంగ్లాదేశ్, పాకిస్థాన్, అప్గణిస్తాన్ వంటి దేశాల్లో ఉన్న హిందువుల రక్షణ కోసం తీసుకొచ్చిన CAA ను కేసీఆర్ వ్యతిరేకిస్తున్నారు అని గుర్తుచేశారు.

ఇదే సమయంలో హైదరాబాద్ లో ఉన్న విదేశీయుల గురించి ఎందుకు మాట్లాడటం లేదు?
పాతబస్తీ నుంచి బకాయిలు వసూలు చేసిన తరువాతే టిఆర్ఎస్ ఓట్లు అడగాలి. బిజెపిని కంట్రోల్ చేసే శక్తి ఎంఐఎం, టిఆర్ఎస్, కాంగ్రెస్ కు లేదు. మేం ప్రజల కంట్రోల్ లో మాత్రమే ఉంటాం అని స్పష్టం చేసారు.

తెరాస ని కంట్రోల్ చేయడానికి ప్రజలు బీజేపీ ని ఆదరిస్తున్నారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో బిజెపిని గెలిపిస్తే గతంలో రూ.10వేలు పొందిన వరద బాధితులకు అదనంగా ఇస్తాం అని మరోసారి తెలిపారు. ఒకవేళ ఎంఐఎంకు మేయర్ పీఠం కట్టబెడితే హిందువులను ఆలయాలకు కూడా వెళ్ళనివ్వరు వీరి కుట్రను గ్రహించి జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఓటు వేయాలి అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ బండి సంజయ్.

Have your say

twenty + twenty =