కెసిఆర్ పతనానికి నాంది పలికే గడ్డ హుజూరాబాద్ గడ్డ – ఈటెల రాజేందర్

Author: Share:
కెసిఆర్ పతనానికి నాంది పలికే గడ్డ హుజూరాబాద్ గడ్డ

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొన్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ గారు.

ఈ సందర్భంగా జోగిపేట లో ఏర్పాటు చేసిన సభలో ఈటల రాజేందర్ గారు మాట్లాడుతూ..

కెసిఆర్ పతనానికి నాంది పలికే గడ్డ హుజూరాబాద్ గడ్డ. కెసిఆర్ నొట్ల కట్టలకి, మద్యం సీసాలు, అహంకారానికి, కుట్రలకు చరమగీతం పాడే గడ్డ హుజూరాబాద్. హుజూరాబాద్ కి తెలంగాణ అంతా అండగా ఉంది.

ప్రగతి భవన్లో నిద్ర పోవడం లేదు కెసిఆర్. నన్ను ఓడగొట్టడానికి ప్రణాళికలు చేస్తుంటే వాటిని అమలు చేస్తుంది హరీష్. ఉద్యమం చేసిన రోజు హరీష్ ను ప్రజలు  నెత్తిమీద పెట్టుకున్నారు. కుట్రలు చేస్తున్న ఈ రోజు ఆయన్ను బండకేసి కొడుతున్నారు.

ధర్మం కోసం, న్యాయం కోసం కోట్లాడిన నా మీదకి ఎంత మంది మంత్రులు వస్తున్నరు మీరు చూస్తున్నారు. అందుకే వాళ్ళు  వీళ్ళు ఎందుకు మీరే పోటీ చేయండి అని కెసిఆర్, హరీష్ కి సవాలు విసిరిన. ప్రజాస్వామ్య బద్ధంగా మీరు గెలిస్తే రాజకీయాలు నుండి తాప్పుకుంటా అని చెప్పిన. నేను గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటారా అని సవాలు విసిరితే ఎవరు రాలేదు.

2023 లో  తెలంగాణలో ఎగిరేది కాషాయ జెండానే.
బీజేపీ కి భారత్ మాతకీ జై అని అనడం వచ్చు, జై శ్రీరామ్ అనడం వచ్చు తెలంగాణా సమాజాన్ని బానిసత్వం నుండి బయటపడవేయడం వచ్చు.

7 సంవత్సరంల పరిపాలన గురించి ఇండియా టుడే సర్వే చేస్తే కెసిఆర్ పాలన కొనసాగడం అరిష్టం అని ప్రజలు చెప్పారు. కెసిఆర్ కి వ్యతరేకంగా 84 శాతం మంది ప్రజలు తమ అభిప్రాయం చెప్పారు.

ఇక్కడేమో మనల్ని విమర్శిస్తారు. ఢిల్లీ వెళ్లి వంగి వంగి దండాలు పెడతారు కేసిఆర్. మీరు వంగి వంగి దండాలు పెట్టినా తెలంగాణ గడ్డమీద బీజేపీ రాజకీయ పోరాటం చేస్తది. అన్ని వర్గాలను ఏకం చేస్తుంది.  కెసిఆర్ ఆనాడు ప్రజలను నమ్ముకున్నాడు ఈ రోజు డబ్బుని నమ్ముకున్నారు. కెసిఆర్ నియంతృత్వంకు, దోపిడీకి, దుర్మార్గాలకు చరమగీతం పాడేందుకు బండి సంజయ్ చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్ర దోహదపడుతుంది అని ఈటల రాజేందర్ అన్నారు. 

Previous Article

KCR working against aspiration of 4 Crore People: BJP

Next Article

What is e-RUPI which Prime Minister Narendra Modi is launching at 4:30PM today.

You may also like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

14 + 2 =