సినీ దర్శకుడు రాజమౌళికి వార్నింగ్ ఇచ్చిన కొమరం భీమ్ మనవడు
తాజాగా విడుదలైన RRR చిత్రం లోని జూనియర్ ఎన్టీఆర్ భీమ్ టీజర్‌పై గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి. గిరిజన వీరుడు కొమురం భీంను టీజర్లో చూపించిన విధానం పై ఆదిలాబాద్ జిల్లా గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీజర్లో కొమరం భీం తలపై టోపి పెట్టి ముస్లీంలా చూపించడంపై ఆదివాసీలు ఫైర్ అవుతున్నారు.
RRR సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ నటిస్తుండగా కొమురం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నాడు.
అయితే సినిమాకు సంబంధించిన ఎన్టీఆర్ కొమరం భీమ్ టీజర్ ఇటీవల విడుదల చేయగా భారీ రెస్పాన్స్ వచ్చింది. కొన్ని ఆరోపణలు వచ్చినప్పటికీ ఎన్టీఆర్ లుక్ మాత్రం చాలా పవర్ఫుల్ గా ఉండబోతోందని తెలుసుతుంది.
అయితే టీజర్ లో తమ ఆరాద్య దైవమైన కొమరం భీంను ఇలా ఇతర పాత్రలో కించపరిచేలా చేసిన సన్నివేశం తమ ఆదివాసీల మనోభావాలను కించపరిచేలా ఉందంటూ రాజమౌళిపై అగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆదివాసీలు.
చరిత్రను తెలుసుకోకుండా ఓ సన్నివేశాన్ని ముస్లీం టోపి పెట్టి కించపరిచేలా చేయడం సరికాదని వాళ్లు ఫైర్ అవుతున్నారు
చిత్రం లో మార్పులు చేయకపోతే, ఆదివాసీలు RRR సినిమాకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతారని కొమురం భీమ్ మనవడు సోన్ రావు హెచ్చరించారు. వివాదాస్పద సన్నివేశాన్ని తొలగించాలని చిత్రనిర్మాతకు హెచ్చరిస్తూ ఆదిలాబాద్ గిరిజన సంఘం ఇటీవల రాజమౌలికి ఒక ప్రకటన విడుదల చేసిందని బాలీవుడ్ లైఫ్ పేర్కొంది.