జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చివరి గంటలోనే భారీ పోలింగ్ ?… అంతా రిగ్గింగ్??

Author: Share:
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చివరి గంటలోనే భారీ పోలింగ్ ?… అంతా రిగ్గింగ్??

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సాయంత్రం 4 గంటల వరకు చాలా తక్కువగా జరిగిన పోలింగ్, అనూహ్యంగా చివరి రెండు గంటలు ఊపందుకోవడం గమనిస్తే అంతా ఒక పద్ధతి ప్రకారం భారీ రిగ్గింగ్ కు పాల్పడిన్నట్లు తెలుస్తున్నది.

సాయంత్రం 5 గంటల వరకు 36.73 శాతం మాత్రమే పోల్ అయిన్నట్లు ప్రకటించిన ఎన్నికల కమీషన్ రాత్రి పొత్తు పోయిన తర్వాత మొత్తం మీద 45.71 శాతం పోల్ అయిన్నట్లు ప్రకటించడం విస్మయం కలిగిస్తున్నది. ఇప్పటివరకు జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఇదే అత్యధిక పోలింగ్‌ శాతం కావడం విశేషం.

అయితే ఈ రోజు ఉదయం 46.6 శాతం పోలింగ్‌ నమోదయ్యిందని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. అంటే గతంలోకంటే ఈ ఎన్నికల్లో 1.31 శాతం పోలింగ్‌ పెరిగింది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత పలు చోట్ల ఒక పద్ధతి ప్రకారం రిగ్గింగ్ కు పాల్పడినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

ముఖ్యంగా మజ్లీస్ కు పట్టుగల పాత బస్తీలో 3 గంటల వరకు చెప్పుకోదగిన పోలింగ్ జరగలేదు. చాలా డివిజన్ లలో 20 శాతం లోపే పోలింగ్ జరిగింది. అయితే ఆ తర్వాత మహిళలు పెద్ద సంఖ్యలో పోలింగ్ బూత్ ల వద్దకు వచ్చారని, వారందరిని మజ్లీస్ వారే పంపి, వారితో రిగ్గింగ్ చేయించి ఉండవచ్చని అక్కడి వారు భావిస్తున్నారు.

పాత బస్తీలో వాస్తవానికి పోలింగ్ 15 నుండి 20 శాతం మించలేదు. అంతకన్నా జరిగిన పోలింగ్ అంతా రిగ్గింగ్ గా పరిగణించాలని సీనియర్ న్యాయవాది ఒకామె చెప్పారు. గత ఎన్నికలలో కూడా పాత బస్తీలో ఇదే విధంగా జరిగినదని ఆమె గుర్తు చేశారు.
2002 ఎంసీహెచ్‌ ఎన్నికల్లో 41.22 శాతం పోల్ అయ్యాయి. జీహెచ్‌ఎంసీ ఆవిర్భావం తర్వాత 2009లో 42.95 శాతం, 2016లో 45.27 శాతం మేర పోలింగ్‌ నమోదైంది. గత ఎన్నికల కంటే స్వల్పంగా పోలింగ్‌ ఇప్పుడు పెరగడం గమనార్హం. జీహెచ్‌ఎంసీలోని 30 సర్కిళ్లలో మొత్తం 150 డివిజన్లు ఉండగా, 149 డివిజన్లకు ఎన్నికలు జరిగాయి.
జీహెచ్‌ఎంసీలో మొత్తం 74,12,601 మంది ఓటర్లు ఉండగా, సాయంత్రం 5 గంటల వరకు 27,22,891 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అప్పటివరకు 36.72ు పోలింగ్‌ నమోదైనట్లయింది. చాలా పోలింగ్‌ కేంద్రాలు ఓటర్లు లేక వెలవెలబోయాయి. ఎక్కడా భారీ క్యూలు కనిపించలేదు.

నగర శివారు ప్రాంతాలే కొంత ఆశాజనకంగా కనిపించాయి. ఇక్కడి సర్కిళ్లలో 40 శాతానికి పైగా పోలింగ్‌ నమోదైంది. ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమవగా 9 గంటల వరకు కేవలం 3.9 శాతం మందే ఓట్లు వేశారు. 11 గంటలకు 11.62 శాతం నమోదవడంతో పోలింగ్‌ ఊపందుకుంటుందని భావించారు.
కానీ, మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా 20.35 శాతమే నమోదైంది. ఉదయం, మధ్యాహ్నం ఆసక్తి చూపని ఓటర్లు.. సాయంత్రం కూడా పోలింగ్‌ బూత్‌ల వైపు పెద్దగా రాలేదు. విద్యావంతులు ఉండే డివిజన్లు, ఐటీ కారిడార్లలోనూ అంతగా పోలింగ్‌ నమోదవలేదు. మధ్యాహ్నం 3 గంటల వరకు 29.76 శాతం, 5 గంటల వరకు 36.73 శాతం మేర పోలింగ్‌ నమోదైంది.

ఇలా ఉండగా, ఎన్నికలలో లక్షల ఓట్లు గల్లంతయ్యాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఓటరు ఐడీ ఉన్నా, ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో వివరాలు కనిపిస్తున్నా పోలింగ్‌‌‌‌ బూత్​లలోని లిస్టుల్లో ఓటర్ల పేర్లు కనిపించలేదు. మరికొన్నిచోట్ల ఓటర్లను ఒక డివిజన్​ నుంచి మరో డివిజన్​కు మార్చేశారు. పక్కపక్క ఇండ్లలోని వారి ఓట్లు కూడా వేర్వేరు డివిజన్ల లిస్టుల్లోకి వెళ్లిపోయాయి.

అసలు లిస్టులో పేర్లు లేక, వేరే డివిజన్లలోకి మారిన విషయం తెలియక ఓటర్లు అయోమయానికి గురయ్యారు. కొన్ని చోట్ల ఓటర్లు, రాజకీయ పార్టీల కార్యకర్తలు ఆందోళనకు దిగారు. చనిపోయినవారి పేర్లు కూడా ఓటర్​ లిస్టుల్లో ఉన్నాయని.. తమ పేర్లు గల్లంతయ్యాయని తీవ్ర నిరసనలు వ్యక్తం చేశారు. కొందరు నేతల ఓట్లు కూడా గల్లంతు కావడం ఆసక్తిగా మారింది.

చాలా డివిజన్లలో ఓటరు స్లిప్పులనే సరిగా పంపిణీ చేయలేదు. దాంతో తమ ఓట్లు ఉన్నాయో లేదో, ఉంటే ఏ డివిజన్, ఏ పోలింగ్​బూత్​ లోకి వెళ్లాయనేది ఓటర్లకు తెలియని పరిస్థితి నెలకొంది.

కొన్ని డివిజన్లలో ఓట్ల గల్లంతుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కావాలనే కొందరి ఓట్లను తొలగించారని స్పష్టం అవుతున్నది. టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌కు ఓటేయరనుకున్న వారి పేర్లను, ప్రతిపక్షాలకు అనుకూలంగా ఉన్న ఓట్లను తొలగించారని భావిస్తున్నారు. ముఖ్యంగా పాతబస్తీ ప్రాంతంలోని పలు డివిజన్లలో హిందువుల ఓట్లు తొలగించారని బీజేపీ నేతలు ఆరోపించారు.

Source
Nijamtoday.com

Previous Article

Altnews founder, Pratik Sinha, caught spreading fake news & propaganda against Modi and BJP

Next Article

Amit Shah’s Hyderabad visit a big blow to KCR’s rule in Telangana: NV Subhash

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

4 × 2 =