విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి విషయంలో చైనాకు చెక్ పెట్టినా నరేంద్రమోదీ ప్రభుత్వం

Author: Share:

ప్రపంచ వ్యాప్తంగా కరోనా సంక్షోభం కొనసాగుతున్న వేళ కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విషయంలో చైనాకు చెక్ పెట్టే దిశలో కఠిన చర్యలు చేపట్టింది. చైనా సహా ఇతర దేశాలు భారత కంపెనీల్లో వాటాలు చేజిక్కించుకోకుండా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలను మరింత కఠినతరం చేసింది.

భారత్‌తో సరిహద్దు పంచుకునే దేశాలు, అక్క డి వ్యక్తులు, కంపెనీలు పెట్టుబడులు పెట్టాలంటే ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవడాన్ని తప్పనిసరి చేసింది. రక్షణ, టెలికం, ఫార్మా సహా 17 రంగాలకు ఈ నిబంధన వర్తిస్తుంది. ఆయా రంగాల కంపెనీల్లో నిర్దేశిత శాతాన్ని మించి విదేశీ పెట్టుబడులు పెట్టాలంటే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది. 5 వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టాలంటే ఆ ప్రతిపాదనను ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ముందుకు తీసుకురావాలి.

మనదేశంలో పెట్టుబడులు పెట్టాలంటే రెండు మార్గాలున్నాయి. ఒకటి ప్రభుత్వ అనుమతి లేకుండానే నేరుగా కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం. రెండోది ప్రభుత్వ అనుమతి తీసుకొని ఇన్వెస్ట్ చేయడం. ఇప్పటి వరకు పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లు రెండో విభాగంలో ఉండేవి. ఇప్పుడు చైనా ను కూడా రెండో విభాగంలో చేర్చారు. ఫలితంగా, చైనా కంపెనీలు, వ్యక్తులు భారత్‌లో పెట్టుబడులు పెట్టాలన్నా, కంపెనీ ల్లో వాటాలు కొనుగోలు చేయాలన్నా ప్రభుత్వ అనుమతి తప్పకుండా తీసుకోవాలి. ఈ మేరకు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది.

చైనాలో పుట్టిన కరోనా వైరస్ కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైపోయింది. అన్ని దేశాల ఎకానమీ దెబ్బతింది. వర్తక వాణిజ్యాలు మూతపడడంతో కంపెనీలు నష్టపోతున్నాయి. ఇదే అద నుగా చైనా పావులు కదుపుతోంది. పెట్టుబడులు పెట్టే సాకుతో కంపెనీల్లో వాటాలు కొనుగోలు చేస్తూ పెత్తనం చేయడానికి ప్రయత్నిస్తోంది.

ఇప్పటికే హెచ్‌డీఎఫ్‌సీలో పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా 1.01 శాతం వాటా కొనుగోలు చేసింది. అమెరికాకు చెందిన కొన్ని కంపెనీల్లోనూ పెట్టుబడులు పెట్టింది. మనదేశంలోనూ కొన్ని కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి స్వాధీనం చేసుకోవడానికి పావులు కదుపుతోంది. ఈ విష యాన్ని పసిగట్టిన మోదీ సర్కారు వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టింది. చైనా ఎత్తుగడలను అడ్డుకోవడానికి FDI నిబంధనలను కఠినతరం చేసింది.

రచయిత:
రంజన్ కుమార్

Previous Article

కరోనా కేసులు : చైనా మాట ఒక అబదలా మూట

Next Article

SM Warriors who are just a tweet away to help the needy amid lock down

You may also like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

3 × 3 =