నమస్తే తెలంగాణ పేపరు జర్నలిజాన్ని కాలరాయటంలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంటుంది అనడానికి ఏమాత్రం కూడా ఆవశ్యక్యం కానే కాదు.
బీజేపి రాష్ట్రాల్లో కరోనా కల్లోలమాట? #నమస్తే_తెలంగాణ పేపరువా లేక నువ్వు కేవలం KCR TRS పార్టీకి కొమ్ము కాయడానికి ఉన్న గుమాస్తా పేపరువా? మీకు ఢీల్లీ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాళ్ రాష్ట్రాల్లో ఎంతటి బయానకమైన పరిస్థితులు ఉన్నాయో అక్కడ మీకు కనీపించడం లేవా?

భారత దేశ చరిత్రలో ఏ భారత ప్రధాని చేయని సాహసం చేస్తు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో దేశాన్ని ఒక పక్కా కరోనా, మరొ వైపు పాకీస్తాన్, చైనా శత్రు దేశాలతో కంటికి కునుకు లేకుండా నిత్యం దేశం కోసం అహర్నశలు పాటు పడుతున్న భరతమాత ముద్దు బిడ్డ మనో దైర్యాన్ని మీరు దెబ్బ తీయాలని చూస్తున్న , అతడు మాత్రం మీ అందరి కోసం పనిచేస్తున్నాడనే విషయం మర్చి పోకండి.
BJP పార్టీకి గాని మరియు #మోది గారికి గాని ఇది మేము పాలించే రాష్ట్రమా లేకపోతే కాదా అనే ఆలోచన అసమానతలు అసలు ఉండనే ఉండవు. అది మీరు గుర్తుంచుకుంటే బాగుంటది. తన ముందు అందరు సమానమే అనే నిష్కలంక కర్మయోగి అతడు.
ఎందుకంటే ఒక రాజు తాను పాలిస్తున్న రాజ్యం అంత తనదే, రాజ్యంలోని అందరు తన సొంత ప్రజలే అని భావిస్తు అందరికి సమన్యాయ పరంగా రాజ పరిపాలన కొనసాగిస్తు ఆ రాజ్యంలోని ప్రజలందరికి ఆ రాజ ఫలాలను సమానంగా అందించాలనే #రాజ_ధర్మాన్ని సూత్రాన్ని మన ప్రధాన మంత్రి శ్రీ నరేంధ్ర మోది ప్రభుత్వం కూడా తూచా తప్పకుండా ఆచరణాత్మకంగా అమలు చేస్తు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాడు.
ఇందులో కూడా నువ్వు మోది గుజరాత్, ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, అరుణాఛల్ ప్రదేశ్ లలో కరోనా పై టెస్ట్ లు నామమాత్రమే చేస్తున్నారు అని అంటూ పత్రిక కలం చేతిలో ఉంది కదా అని కళ్ళి బొళ్ళి మాటలతో KCR ప్రజల్ని మాయ చేసినట్టు నువ్వు అబద్దాలన్ని కల్పించి ప్రచురిస్తే ఎటువంటి కచర రాతలు రాసిన ప్రజలు నమ్ముతారు అని ఫౌమ్ హౌస్ పడుకొనే కలల్లోంచి ఒకసారి బయటకు వచ్చి చూడు #నమస్తే_తెలంగాణ పత్రిక.
ఒకసారి అన్ని BJP పాలిత రాష్ట్రాల పై #ICMR కు #RTI అప్లై చేసి చూడు నిజా నిజాలు మీకే తెలుస్తాయి. కేంధ్ర ప్రభుత్వం కరోనా మహమ్మరి పై పోరాడాటానికి రాష్ట్రంకు వందల కోట్ల నిధులిస్తే వాటిని పక్కా దారి పట్టించి , ప్రజల ప్రాణాలు గాలికి వదిలేస్తే మీ కచర ప్రభుత్వానికి హైకోర్టు చివాట్లు పెట్టిందన్న విషయం అప్పుడే మర్చిపోయారా మీ? ఇలాంటి వార్తలు మాత్రం అసలు మీ పత్రికల్లో ఎందుకు రాయరు?
4 కోట్ల ప్రజలున్న తెలంగాణ రాష్ట్రంలో దుర దృష్టవత్తు ఎవరైన కరోనా బారిన పడితే కేవలం ఒకే ఒక్క గాంధీ హస్పిటల్ ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి KCR గారు ఎవరికి కరోనా వచ్చిన అందరు గాంధీ హస్పిటల్ కే రావాలి అని గొప్పలు చెప్పాడు. మరి తన సొంత #MLA లకు కరోన వస్తే మాత్రం ప్రైవేట్ హస్పిటల్స్ కి పరుగులు పరుగులు పెడితిరి. అంటే మీ పార్టీ వాళ్ళవి ప్రాణాలు కాని తెలంగాణ ప్రజలవి ప్రాణాలు కావా?
గాంధీ హస్పిటల్ లో కరోనా రోగులు, కరోనాతో మరణించిన సంఖ్యలను ప్రభుత్వం ఎందుకు బయట పెట్టడం లేదు? వీటిని ప్రశ్నించే ధమ్ములేదా నీకు? ప్రభుత్వం వీటి పై శ్వేత పత్రం విడుదల చేసే ఉందా మీ ప్రభుత్వానికి?
ఆ ఉన్న ఒక్క హాస్పిటల్ లో అయిన కనీస వైద్య సిబ్బంది, వైద్య సదుపాయాలైన ఏమైన సరిగ్గా ఉన్నాయా అంటే అది కూడా దిక్కులేదు. గాంధీ హస్పిటల్ వైద్యులు కరోన రోగులకు వైద్యం అందించాలా? లేక ధర్నాలు చేయాలా? మరి వాటి పై ఎందుకు మీ పత్రికల్లో రాయడం లేదు?
#బంగారు_తెలంగాణ పేరు చెప్పి తెలంగాణ ప్రజల బతుకులు ఆగం ఆగం చేసి తెలంగాణను కాస్త #కరోనా_తెలంగాణ గా తీర్చి దిద్దుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావ్ కు కూడా నియంతృత్వ నిజాం నియంతకు పట్టిన గతే పడుతుంని, గుర్తుంచుకొవల్సిందిగా యావత్ తెలంగాణ సమాజం తరపున ఒక సామాన్య భారతీయ జనతా పార్టీ కామారెడ్డి కార్యకర్త తీవ్రంగా హెచ్చరిస్తున్నాను.

Author
రమేష్ రెడ్డి, కామారెడ్డి