National

అనంత పద్మనాభస్వామి ఆలయం, పరిపాలన పై సర్వ హక్కులు ట్రావెన్‌కోర్ రాజ కుటుంబానిదే : సుప్రీంకోర్టు సంచలన తీర్పు

1991లో ఈ ఆలయ సంస్థానాదీశులైన ట్రావెన్‌కోర్ చివరి పాలకుడు మరణించిన కారణంగా రాజ కుటుంబ హక్కులు నిలిచిపోతాయనేది 2011లో కేరళ హైకోర్టు ( Kerala Highcourt ) ఇచ్చిన తీర్పు సారాంశం. ఆలయ నిర్వహణ కోసం ఓ ట్రస్ట్ ఏర్పాటు చేయాలని కోర్టు సూచించింది.

దాంతోపాటు మిగిలిన ఆరవ నేలమాళిగ గదిని కూడా తెరవాలని ఆదేశించింది. కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై విబేధించిన ట్రావెన్‌కోర్ వంశీయులు హక్కులు తమకే చెందుతాయంటూ సుప్రీంను ఆశ్రయించారు.

అప్పట్నించీ పెండింగ్ లో ఉన్న ఈ కేసుకు 9 ఏళ్ల అనంతరం తెర దిగింది. కేరళ హైకోర్టు తీర్పును కొట్టిపారేసింది. చివరి పాలకుడి మరణంతో హక్కులు రద్దు కావని స్పష్టం చేసింది. ఆలయ నిర్వహణ సైతం ఆ కుటుంబానిదేని చెప్పింది.

కొత్త కమిటీ ఏర్పాటయ్యే వరకూ జల్లా న్యాయమూర్తి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆలయ నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షిస్తారని, ప్రస్తుత కమిటీ కొనసాగుతుందని సుప్రీంకోర్టు తన తీర్పు లో పేర్కొంది.

Have your say

five × three =