హిందువుల పై సంచలన వ్యాఖ్యలు చేసిన మోహన్ భగవత్.
ఏకత్వంలో అనేకత్వం, అనేకత్వంలో ఏకత్వం భారతీయ విశిష్ట లక్షణమని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పేర్కొన్నారు. ఇక్కడి పూజా విధానాలు, కర్మకాండలు ఏ విధంగా ఉన్నప్పటికీ ఇక్కడ అందరూ కలసి జీవిస్తున్నారన్నారు. మేకింగ్ ఆఫ్ ఏ హిందూ పేట్రియాట్- బ్యాక్ గ్రౌండ్ ఆఫ్ గాంధీజీస్ హింద్ స్వరాజ్ పేరిట ముద్రితమైన పుస్తకాన్ని మోహన్ భగవత్ ఆవిష్కరించారు. భిన్నత్వం అంటే ఈ సమాజం నుంచి విడివడటం కాదన్నారు.
గాంధీ భావజాలంపై రాసిన ఈ పుస్తకం ప్రామాణిక పరిశోధనా గ్రంథంలాంటిదన్నారు. అయితే ఈ పుస్తక ఆవిష్కరణ ఆర్ఎస్ఎస్ తరపున జరగడంపై అందరూ చర్చించుకుంటున్నారని, అలా ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు. గాంధీజీ జీవితంపై పరిశోధన సాగించి ఈ పుస్తకాన్ని వెలువరించారని అన్నారు. గాంధీజీ ఒకసారి… తన దేశభక్తి తాను అనుసరిస్తున్న ధర్మం నుంచి వచ్చిందన్నారు. హిందుత్వం మూలాలు దేశభక్తిలో ఉన్నాయని, దీనిలో దేశద్రోహ భావనకు అవకాశం లేదన్నారు. స్వధర్మాన్ని అవగాహన చేసుకోనంత కాలం స్వరాజ్యమనేదేమిటో అర్థం కాదన్నారు. గాంధీ తన ధర్మం సర్వ ధర్మాలకు ధర్మమన్నారు. తాను ధర్మాన్ని అర్థం చేసుకునే దేశభక్తుడను అయ్యానని గాంధీజీ తెలిపారు. ప్రజలంతా దీనిని అర్థం చేసుకోవాలని మోహన్ భగవత్ కోరారు.