వారికి కేసీఆర్ వంగి వంగి సలాం కొడుతున్నారు : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.

Author: Share:

సిద్దిపేట : దుబ్బాక ఉప ఎన్నిక దగ్గరపడే కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు తరఫున శుక్రవారం నాడు ఎన్నికల ప్రచారం చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేసీఆర్ సర్కార్, కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు.

తెలంగాణ కోసం 1200 మంది చనిపోయారు. వారంత ఎందుకు చనిపోయారు.. తెలంగాణ బాగుండాలనే కదా. కానీ కేసీఆర్ మాత్రం తాను ముఖ్యమంత్రి కావాలనే వారంతా ఆత్మబలిదానాలు చేశారని అంటున్నారు. ఇంతకీ కేసీఆర్ ఒక్క గజ్వెల్‌కే ముఖ్యమంత్రా లేకుంటే రాష్ట్రం మొత్తానికా..? అని ప్రశ్నించారు.

తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఅర్ అప్పుల పాలు చేశారు. కేసీఅర్ కుటుంబ పాలన వల్లనే అప్పులు, అవినీతి రాష్ట్రంలో అడ్డగోలుగా పెరిగాయి అని అన్నారు.

తెలంగాణను కుటుంబ పాలన నుంచి విముక్తి కలిగించడం బీజేపీకే సాద్యం’ అని కేంద్ర మంత్రి చెప్పుకొచ్చారు.

కేసీఆర్ సీఎం అయ్యాక దుబ్బాకకు అన్ని రకాలా అన్యాయం జరిగింది. టీఆర్ఎస్ నేతలు ఈ నియోజకవర్గంపై సవతి తల్లి ప్రేమను చూపారు. అందుకే దుబ్బాక ప్రజల్లో చైతన్యం వచ్చింది. టీఆర్ఎస్ కుటుంబ సభ్యుల నియోజకవర్గాలు అభివృద్ధి జరిగాయి.

కాంగ్రెస్‌కు ఓటేస్తే టీఆర్ఎస్‌కు వేసినట్లే. ఉత్తమ్ కుమార్ రెడ్డి టీపీసీసీ చీఫ్‌గా ఉన్నప్పుడే 12 మంది ఎమ్మెల్యేలు గాంధీభవన్ నుంచి తెలంగాణ భవన్‌కు వెళ్లారు’ అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్, టీఆర్ఎస్‌లు బొమ్మా, బొరుసు పార్టీలు. మజ్లీస్ మతోన్మాద పార్టీ. రజాకార్ల పార్టీ మజ్లిస్. వారికి కేసీఆర్ వంగి వంగి సలామ్ కొడుతున్నారు. బియ్యానికి ప్రధాని మోదీ ఏమీ ఇవ్వడం లేదని మంత్రి హరీష్ రావు అన్నాడు. కేసీఆర్ సర్కారు కేజీ బియ్యానికి ఇచ్చేది రెండు రూపాయలే.. మిగతా డబ్బులు మోదీనే ఇస్తున్నారు. ప్రజలు దుబ్బాక ఆత్మగౌరవం నిలవాలన్నా నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలన్నా బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావును గెలిపించాలి’ అని దుబ్బాక ప్రజలకు కిషన్ రెడ్డి సూచించారు.

Previous Article

ఇంకెన్ని కుట్రలు చేస్తవు హరీష్ రావు..?

Next Article

80% కరోనా పేషెంట్స్ రక్తంలో అదే లోపం ?

You may also like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

five + 5 =