Local

గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.

Hyderabad: భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో పలు రూట్లలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. జనవరి 26వ తేదీన (మంగళవారం) నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. దాంతో నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ వెల్లడించారు.

మొజంజాహి మార్కెట్‌ తాజ్‌ ఐల్యాండ్‌, చాపెల్‌ రోడ్డు టీ జంక్షన్‌, సైఫాబాద్‌ పాత పీఎస్‌, బషీర్‌బాగ్‌ జంక్షన్‌, ఇక్బాల్‌ మీనార్‌, ఏఆర్‌ పెట్రోల్‌ పంప్‌, ఆదర్శ్‌నగర్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు.

ఈ ఆంక్షలు మంగళవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అమల్లో ఉంటాయని సీపీ వివరించారు. కావున ప్రజలందరూ అధికారులకు సహకరించాలని, ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సీపీ అంజనీ కుమార్ కోరారు. ఆ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

Have your say

4 × 1 =