రిజిస్ట్రేషన్ శాఖను రీసెర్చ్ సెంటర్ లాగా మార్చుతున్నారు: ఎమ్మెల్యే జగ్గారెడ్డి

Author: Share:

ధరణి తో ప్రజల ఆస్తులకు కొత్తగా భద్రత వస్తుంది అని నమ్మించారు ఎవరి ఆస్తులు వాళ్ళ దగ్గరే ఉన్నాయి ఆస్తుల వివరాలు మీకెందుకు అని అధికారులను నిలదీశారు జనం అని తెలిపారు.

సీఎం తెలిసి చేస్తున్నాడో… తెలియక చేస్తున్నాడో అర్థం కావడం లేదు అని అన్నారు.

నిజాం కాలం నుండి ఆస్తులకు భద్రత ఉంది. ఏ అధికారి ఇలాంటి సూచనలు చేస్తున్నాడో అర్థం కావడం లేదు

ఐదు నెలల నుండి రిజిస్ట్రేషన్ శాఖ నిలిచి పోయింది. కరోనా కాలం లో ఆస్తులు అమ్ముకునో… బ్యాంక్ లోనే తెచ్చుకుందాం అనుకున్నా వీలు కాలేదు.అలా ప్రాణాలు పోయిన వారు కూడా ఉన్నారు.

CS కి కరోనా వస్తే… ఆయన చేతిలో డబ్బులు లేకుంటే డబ్బులు ఎలా తెచ్చుకోవాలో ఆయనకు తెలిసేది అని ఆరోపించారు.

రిజిస్ట్రేషన్ శాఖను బంధు చేయడం వల్ల ఎంత మంది ఇబ్బంది పడ్డారో అధికారులకు తెలియదు.

జనం సమస్యలు అధికారులు చూస్తున్నారో లేదో. అధికారులు పిచ్చి ఆలోచనలు మానుకోవాలి అని తెలిపారు.

రాష్ట్రాన్ని దివాళా తీయకండి కోర్ట్ ని అడ్డుపెట్టుకుని ఇన్నాళ్లు రిజిస్ట్రేషన్ల ఆపారు. పాత పద్దతిలో రిజిస్ట్రేషన్ చేస్తాం అన్నారు కేసీఆర్.. కానీ అమలు కావడం లేదు. పాత పద్దతిలో ఎందుకు రిజిస్ట్రేషన్ చేయడం లేదో సమాధానం చెప్పాలి అని అడిగారు.

రియల్ ఎస్టేట్ వ్యాపారం కుప్ప కూలింది. సీఎం, సీస్ లు తక్షణమే పాత పద్దతిలో రిజిస్ట్రేషన్ చేయాలి అని డిమాండ్ చేశారు.

ప్రజల ఉసురు ప్రభుత్వానికి తాకుతుంది అది ప్రభుత్వానికి మంచిది కాదు అని వ్యాఖ్యలు చేశారు.

అధికారుల మాటలు విని సీఎం చెడ్డ పేరు తెచ్చకోవద్దు, LRs మీద కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వండి అని డిమాండ్ చేశారు.

అసెంబ్లీ లో ఇచ్చిన మాట నిలవెట్టుకోండి కేటీఆర్ సమస్య ముదిరి…ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చుకోవద్దు అని సూచించారు.

ప్రజలు ఆందోళనకు దిగితే… ప్రభుత్వం ఇబ్బందుల్లో పడటం ఖాయం అని హెచ్చరించారు.

Previous Article

తెరపైకి మళ్ళీ డ్రగ్స్ కేస్

Next Article

భారత ప్రభుత్వం వ్యవసాయ చట్టం 2020 ఎందుకు తీసుకువచ్చింది ?

You may also like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

seventeen + three =