వరంగల్: ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ లో ఉన్నదో లేక ప్రగతి భవన్ లో ఉన్నదా ఎవరికి తెలవాదు: బండి సంజయ్.

Author: Share:

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వ‌ర్షాల‌కు నీట మునిగిన వ‌రంగ‌ల్ , హన్మకొండ, హసన్ పర్తిలో వరద ముంపు ప్రాంతాలను, నీట మునిగిన కాలనీలను, పంటపొలాలో పర్యటించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్.

ఈ సందర్భంగా సంజయ్ ప్రభుత్వం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సంజయ్. రాష్ట్రం మొత్తం వర్షాలతో అతలాకుతలం అవుతుంటే సీఎం కేసీఆర్ మాత్రం ఫౌంహౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు.

2016 వ‌రంగ‌ల్ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఒక్కటైన నేరవేర్చరా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. స్థానిక ప్రజాప్రతినిధుల చేతకానితనం వల్లే వరంగల్ మహా నగరానికి ఈ దుస్థితి ఏర్పడిందన్నారు. కేంద్రం ఇచ్చిన స్మార్ట్ సిటీ నిధులను దుర్వినియోగం చేశారన్నారు.

వరంగల్ ప్రజలకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. ప్రతి విషయంలో కేంద్రంపై నిందలు వేయడం మానుకుని మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు బండి సంజయ్

Previous Article

Kashmir: Recalling my horror Days of Refuge

Next Article

గణేష్ ఉత్సవ మండపాల ఏర్పాటుకు అనుమతిలేదు : వరంగల్ పోలీస్ కమిషనర్.

You may also like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

nineteen − sixteen =