విచ్చలవిడిగా నోట్ల కట్టలతో తెరాస పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు హోటళ్లలో అధికార దుర్వినియోగం చేస్తుంటే పోలీస్ యంత్రాంగం నిద్రమత్తులో ఉందా ? : బండి సంజయ్

Author: Share:

హైద్రాబాద్: దుబ్బాక ఎన్నికలకు మరి కొన్ని గంటల మిగిలి ఉన్న తరుణంలో తెరాస పార్టీ పై మరియు పోలీస్ శాఖ పై తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఘాటుగా స్పందించిన కరీంనగర్ ఎంపీ, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్.

ఓటమి భయంతో తెరాస పార్టీ అడ్డదారుల్లో గెలవాలని చూస్తుంది. ప్రజా బలం లేకపోవడంతో పైసల బలంతో ఎలాగైనా నెగ్గాలని చూస్తుంది. దొంగలకు సద్దులు మోసిన అనుభవంతో తెరాస మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు సంచులు మోస్తున్నారు అని ఆరోపించారు సంజయ్.

విచ్చలవిడిగా నోట్ల కట్టలతో ఎమ్మెల్యేలు, ఎంపీలు హోటళ్లలో అధికార దుర్వినియోగం చేస్తుంటే పోలీస్ యంత్రాంగం నిద్రమత్తులో ఉందా ?
బీజేపీ కార్యకర్తలపై దాడి చేసిన వారిని, డబ్బులు పంపిణీ చేస్తున్న వారిని తక్షణమే అరెస్టు చేసి వారి పై క్రిమినల్ కేసులు నమోదు చెయ్యాలి తెలిపారు.

అర్ధరాత్రి దుబ్బాక కేంద్రంగా ప్రజాస్వామ్యాన్ని కెసిఆర్ ప్రభుత్వం ఖూనీ చేస్తుంది. ఎవరెన్ని కుట్రలు చేసినా బీజేపీ గెలుపు ఖాయం. ఈ గెలుపును మీ నోట్ల కట్టలు,అధికార మధం ఆపలేవు. రాబోయే 18 గంటలు పూర్తి స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని కోరారు.

ఉల్టా చోర్ కొత్వాల్కో ధాంటే అన్నట్టు మీరే డబ్బుల పంపిణీ చేస్తూ మా పై నిందలు వెయ్యడం దారుణం. ఇంత జరుగుతుంటే బీజేపీ పై నిందలు మోపే విధంగా కొన్ని ప్రసార మాధ్యమాల ద్వారా నిందలు మోపేలా ప్రసారం చేస్తారా ? అని ఘాటుగా స్పందించారు సంజయ్.

Previous Article

Ayodhya Ram Mandir: About 1-5 lakh Bhakts expected each day, trust seeks designs for Museum, Gurukul, Gaushala

Next Article

భూపాలపల్లి : శ్రీనివాస్ త్వరగా కోలుకోవాలని హనుమాన్ దేవాలయంలో పూజలు నిర్వహించిన భూపాలపల్లి అసెంబ్లీ ఇంచార్జి కీర్తి రెడ్డి.

You may also like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

1 × three =