తెలుగు

తెలంగాణ: రిజిస్ట్రేషన్లు, లైసెన్సులు, అనుమతులు జారీ

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు, రిజిస్ట్రేషన్లు, లైసెన్సులు, అనుమతులు జారీ, తనిఖీ లు, రికార్థులు, Filings తదితర అంశాలకు సంబంధించి compliances burden ను తగ్గించడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించుటకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ప్రభుత్వంలోని 7 శాఖలకు సంబంధించి, రెవెన్యూ(వాణిజ్య పన్నుల మరియు ఎక్సైజ్ ) , పౌరసరఫరాల శాఖ, రవాణా , ఎనర్జీ, హోం, పురపాలక మరియు కార్మిక, ఉపాది శిక్షణ శాఖల లో compliances burden ఎక్కువగా ఉన్నందున, వాటిని తగ్గించడానికి సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో సోమవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు. శాఖలు అంతర్గతంగా విశ్లేషించి, సబ్ గ్రూప్ లను ఏర్పాటు చేసి ప్రాసెస్ పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రక్రియను చేపట్టుటకు అంతర్గత విశ్లేషణ కై సబ్ గ్రూపులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సులభతర వాణిజ్య నిబంధన ల తయారులో తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న పారిశ్రామిక, వర్తక ప్రోత్సాహక నిబంధనలు, చట్టాలను పరిశీలించాలని సూచించారు.
కేంద్ర ప్రభుత్వ Department for Promotion of Industry and Internal Trade (DPIIT), తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన చట్టాలు, రెగులేషన్ లను share చేసిందని , వీటిని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించి ప్రాసెస్ ను సులభతరం చేయటానికి చర్యలు తీసుకోవాలని కోరారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు.
ఈ సమావేశంలో కార్మిక, ఉపాది శిక్షణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీమతి రాణి కుముదిని, రహదారులు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ సునీల్ శర్మ, ఐ.టి. శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ జయేష్ రంజన్, హోం శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ రవి గుప్తా, పౌరసరఫరాల శాఖ E.O. కార్యదర్శి శ్రీ అనిల్ కుమార్ , పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి శ్రీ సందీప్ కుమార్ సుల్తానియా తదితర అధికారులు పాల్గొన్నారు

Have your say

13 + 14 =