తెలంగాణ పోరాటాల పురిటి గడ్డ త్యాగాల నేల తెలంగాణ అంటేనే ఉద్యమం, తెలంగాణ అంటేనే త్యాగం, తెలంగాణ అంటేనే ప్రేమ ఆప్యాయత తెలంగాణ ను తల్లిగా కొలిచే ఒక అద్భుతం మరి ఇలాంటి తెలంగాణ లో మహిళలకు గౌరవం,రక్షణ ఉందా?? పోరాటాలే ఊపిరిగా గత 60 సంవత్సరాల కాలంలో ప్రతిరోజూ ఆత్మాభిమానం కోసం స్వపరిపాలన కోసం, స్వరాష్ట్రం కోసం అనేకమంది ఉద్యమకారులు అనేకమంది మేధావులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఉధ్యమించి అమరులైనారు ఇందులో మహిళల పాత్ర ప్రధాన భూమిక పోషించి తెలంగాణ తల్లి ని ఆంధ్ర పాలకుల కబంధ హస్తాల నుండి విముక్తిని కల్పించారు.
మరి నేటి స్వతంత్ర స్వపరిపాలన రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులు, మహిళా రక్షణ, చాలా ప్రమాదకరం గా ఉంది దీనికి గతంలో జరిగిన అమానవీయ సంఘటనలు సాక్ష్యం. గత 28 నవంబర్ 2019 నాడు జరిగిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి (దిశ) హత్య నిత్యం రద్దీగా ఉండే ఔటర్ రింగ్ రోడ్డు కు కూతవేటు దూరంలోనే ఈ ఘటన జరగడం అత్యంత పాశవికంగా నలుగురు మానవ మృగాలు దారుణంగా మానభంగం చేసి సజీవ దహనం చేయడం.
మరోఘటన పాల్వంచలో మే 24,2020లో 41 ఏళ్ళ వివాహిత మహిళల ను 21 సంవత్సరాల యువకుడు వేధించడం తో ఆత్మహత్య చేసుకుంది ఇంకో దగ్గర జూన్ లో వీఆర్ఏ భార్యను వీఆర్వో లైంగికంగా వేధించాడు అదేవిధంగా హైదరాబాద్ లో ఒక మైనర్ దళిత బాలికపై మజ్లిస్ పార్టీ యువనేత అత్యాచారం చేసిన ఘటన, ఇలా ప్రతిరోజూ ఎక్కడో ఒక చోట మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకి పెచ్చరిల్లిపోతున్నాయి.
ఒక జాతీయ సర్వే లో మహిళా రక్షణ లో మన తెలంగాణ 12 లో స్థానంలో ఉంది అంటే ఆలోచించాల్సిన విషయమే కాగా 2012 డిసెంబర్ 16 నా దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఘటన జ్యోతి సింగ్ (నిర్భయ) ఉదంతం ఈ ఘటన తర్వాత నిర్భయ చట్టం 2013 ఫిబ్రవరి 3 న అమలులోకి వచ్చిందినిర్భయ సహాయ నిధి నుంచి ప్రతి రాష్ట్రానికి మహిళల భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తోంది.
ఈ నేపథ్యంలో ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్టు సిస్టం కోసం తెలంగాణ ప్రభుత్వానికి 2014లో రూ. 9.57 కోట్లు కేటాయించారు. అందులో కేవలం రూ. 25 లక్షలు మాత్రమే ఖర్చుచేసినట్లు సమాచారం. అత్యాచార బాధితులకు తక్షణం అందాల్సిన మానసిక, శారీరక చికిత్సలతోపాటు, కౌన్సెలింగ్, న్యాయ సహాయం వంటివన్నీ ఒకేచోట లభ్యమయ్యేలా వన్‌స్టాప్ క్రైసిస్ సెంటర్లను నెలకొల్పేందుకు రూ.11 కోట్లు నిర్భయ సహాయ నిధి నుంచి అందాయి. వాటిల్లో కోటి రూపాయలను మాత్రమే ఖర్చు చేసింది తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా బాధిత మహిళలకోసం ఉచిత హెల్ప్‌లైన్‌ను నెలకొల్పేందకు రూ .28 లక్షలు కేటాయించారు. అందులో ఒక్కరూపాయి కూడా రాష్ట్రప్రభుత్వం ఖర్చు చేయలేదు మరి ఈ సొమ్మంతా ఎక్కడ ఎందుకోసం ఖర్చు చేయలేదు, అంటే మహిళల పట్ల మీకున్న గౌరవం, మర్యాద ఇదేనా అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు కేంద్ర నిధులు ఇస్తే మీరు వాటిని మహిళా సంక్షేమ భద్రత కోసం కాకుండా ఇంకెవరికోసం ఖర్చుచేసారో ప్రతి ఒక్క పైసా తో సహా లెక్క చెప్పాలి
దౌర్భాగ్యం ఏంటంటే తెలంగాణ లో మహిళల సమస్యల పరిష్కారానికి మహిళా కమిషన్ చైర్మన్ లేకపోవడం గత రెండేళ్లుగా చైర్మన్ ని నియమించకుండా కాలాయాపన చేస్తోంది ఈ తెలంగాణ ప్రభుత్వం కనీసం చట్టసభల్లో మహిళలకు సరైన సముచిత స్థానం ఇవ్వకుండా కేవలం నామమాత్రపు పదవుల్లో మహిళలను ఉంచి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా సత్యవతి రాథోడ్ గారు ఉన్నా మహిళా సంక్షేమ, భద్రత భరోసా పైన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చాలా దురదృష్టకరమైన విషయం.
మహిళా కమిషన్ చైర్మన్ ను నియమించి ఆ సంస్థ నిర్వాహన కోసం నిధులు కేటాయించి సంస్థ స్వయం ప్రతిపత్తి కల్పించాలని పూర్తి స్థాయి వెబ్ సైట్ ను పెట్టి మహిళలు ఏం సమస్య వచ్చినా నిరభ్యంతరంగా తమ వెతను తెలుసుకునే విధంగా ఉండాలి అని మహిళా సంఘాలు, సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు కానీ తెలంగాణ ప్రభుత్వం కనీసం కూడా స్పందించకపోవడం శోచనీయం చట్టాల అమలు నిర్వహణ వ్యవస్థ కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించి పోరాడి తెచ్చుకున్న తెలంగాణ లో మహిళలకు రక్షణ కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారికి ఒక మహిళ గా తల్లిగా , కూతురు గా విజ్ఞప్తి చేస్తున్నాను

Author
Hyndavi Reddy