సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచనా దినోత్సవాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలి. అదే నాటి అమరవీరులకు నిజమైన నివాళి

Author: Share:

భారతదేశమంతా 1947 వ సంవత్సరం ఆగస్టు 15న బ్రిటీషు బానిస సంకెళ్ళ నుండి స్వాతంత్రం పొందింది. బ్రిటిష్ సామ్రాజ్యవాద శక్తుల నుండి దేశ యువత అంతా బంధవిముక్తులై స్వేచ్ఛా వాయువులను పీలుస్తున్నారు. మువ్వన్నెల పతాకం దేశం నలుమూలలా రెపరెపలాడుతున్నది. అయితే ఆనాటి హైదరాబాద్ సంస్థానమైన నేటి తెలంగాణ ప్రాంతం మరియు మహరాష్ట్ర మరియు కర్ణాటక రాష్ట్రంలోని కొన్ని జిల్లాలు మాత్రం స్వేచ్ఛా వాయువుల కొరకు కోటి ఆశలతో ఎదురు చూస్తున్నాయి. నాటి హైదరాబాద్ సంస్థానం నిజాం నవాబు ఏలుబడి లో ఉండేది, నిజాం నవాబు దాస్య శృంఖలాల నుండి రజాకార్ల ఆకృత్యాలనుండి నాటి హైదరాబాద్ సంస్థానానికి ఉక్కు మనిషి భారత ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ మరియు ఆనాటి ఏజెంట్ జనరల్ కె.ఎం.మున్షీ చాకచక్యం ద్వారా హైదరాబాద్ సంస్థానం విముక్తి పొందింది, భారత యూనియన్ లో విలీనమైంది, నిజాం అరాచకాల నుండి విముక్తి పొందింది కావున ఇది ముమ్మాటికీ విమోచనమే, ఈ విముక్తి కొరకు వేలాది మంది తమ ప్రాణాలను పణంగా పెట్టారు, తమ సర్వస్వాన్నీ త్యాగం చేశారు, వందల గ్రామాలను ఆనవాళ్ళు సైతం లేకుండా కోల్పోయారు మాతృభూమి స్వేచ్ఛ కోసం ప్రాణాలకు తెగించిన అనేకమంది అమరవీరుల త్యాగ ఫలితమే నేటి తెలంగాణ విమోచన విమోచనం కావున ఏది ఏమైనప్పటికీ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని గతంలో ఉద్యమ సమయంలో అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించినట్లుగానే తెరాస ప్రభుత్వం  అధికారికంగా పండుగ వాతావరణంలో నిర్వహించాలి

 అయితే నిజాం నవాబు ఎవరు ఎందుకు ఇంతటి ఆకృత్యాలకు ఒడిగట్టారు అంటే కారణం కూడా లేకపోలేదు నిజాం నవాబు బ్రిటిష్ సామ్రాజ్యానికి నమ్మకమైన బంటు, బ్రిటిష్ పాలకులకు తొత్తులుగా మారిన దేశద్రోహి, హైదరాబాద్ సంస్థానాన్ని సార్వభౌమాధికారాలు గల ఇస్లాం రాజ్యాంగా రూపొందించాలనే కలలు కంటూ తద్వారా హైదరాబాద్ సంస్తానానికి సరిహద్దుగా ఉన్న గోవా ప్రాంతాన్ని కొనుగోలు చేసి సముద్ర మార్గం ద్వారా బ్రిటిష్ సామ్రాజ్యంతో వ్యాపార లావాదేవీలు చేసుకుని ఇక్కడున్న హిందూ సమాజాన్ని బానిసలుగా చేసుకునేందుకు మరియు వారిని శ్రమ దోపిడీకి గురి చేసేందుకు అనేక ప్రయత్నాలు చేశాడు. నిజాం నవాబు బయటకు హిందువులు ముస్లింలు నాకు రెండు కళ్ళ లాంటి వారు. ఇరువురు సోదరభావంతో కలిసుండాలి అని నీతులు వల్లిస్తూనే రజాకార్లతో హిందువులపై దాడులు చేయించేవాడు, ప్రభుత్వంలో ఉన్నవారు కూడా నిజాం నవాబుకు వంత పాడటం తప్పితే మరో గత్యంతరం ఉండేది కాదు. నిజాం నవాబు హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్ లో  చేరకుండా తీవ్ర ప్రయత్నాలు చేశాడు భారత సైన్యం తో సైతం యుద్ధం చేయడం కొరకు ఆయుధాలను కూడా వరంగల్ లోని మన్ననూరు విమానాశ్రయం ద్వారా తెప్పించుకున్నాడు, నిజాం నవాబు రజాకార్ల ద్వారా రజాకార్ల నాయకుడు ఖాసిం రజ్వీ, తన తమ్ముడు తయ్యబ్ రజ్వీ ద్వారా ఇక్కడున్న హిందువులను చిత్రహింసలకు గురి చేసేవారు దోపిడీలు,మానభంగాలు,హత్యలు ఇలా చెప్పుకోలేనివెన్నో,  ఎన్నో చిత్రహింసలు, మానసిక క్షోభ ఇవన్నీ భరించినా చివరికి ప్రాణాలు దక్కుతాయా అంటే దక్కుతాయని ఖచ్చితంగా చెప్పలేం మరి ఇంతటి దారుణాల నుండి విముక్తి పొందిన అటువంటి రోజున తెలంగాణ విమోచన దినోత్సవం జరిపితే తప్పేంటి, తప్పేమీ లేదు,  తప్పకుండా తెరాస ప్రభుత్వం తెలంగాణ విమోచనా దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాల్సిందే. నీళ్లు నిధులు నియామకాలు తక్కువ అయ్యాయనే మనం సమైక్యాంధ్ర నుండి విడిపోయి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నాం, రాష్ట్రం వచ్చిన రోజు పండుగగా జరుపుకుంటున్నాం, అటువంటిది నిజాం దాస్య శృంఖలాల నుండి, రజాకార్ల అకృత్యాల నుండి, విముక్తి పొందిన రోజు సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా  జరుపుకుంటే తప్పేంటి ప్రభుత్వం జరపాల్సిందే అంతేకానీ నేటి ముఖ్యమంత్రి కెసిఆర్ గారు మైనార్టీల సంతుష్టీకరణ, ఓటు బ్యాంకు రాజకీయాల కొరకు ఎంఐఎం మద్దతు కోరకో నేను నిజాం వారసుడు అని ప్రకటించడం, నిజాం గొప్ప రాజు అని కీర్తించటం, నిజాంను స్తుతించటం నాటి అమరవీరులను అవమానించడమే అవుతుందని తెలంగాణా సభ్య సమాజం భావిస్తోంది

 నిజాం నవాబు వ్యక్తిగత సైన్యమే ఖాసీం రజ్వీ రజాకార్ల బృందం నిజాం నవాబ్ ఆలోచనలను వ్యతిరేకించేవారి మీదకి నిజాం రజాకార్లను పంపించి, గ్రామాలకు గ్రామాలను మట్టు పెట్టించేవాడు, ఆస్తులను ధ్వంసం చేయించే వాడు, స్త్రీలను, ముసలివాళ్ళు, చిన్నపిల్లలు అని చూడకుండా అతి పాశవికంగా ప్రవర్తించేవారు రజాకార్ల అకృత్యాలు ఒక దశలో అడ్డూ అదుపు లేకుండా పోయింది అయితే సాధారణంగానే ఉద్యమస్ఫూర్తితో ఉండే ఆనాటి హైదరాబాద్ సంస్థాన ప్రజలు కొన్ని సందర్భాల్లో రజాకార్లను సైతం పరిగెత్తించిన సందర్భాలున్నాయి కానీ రజాకార్లు సరైన  సమయం చూసి నాటి పోలీసు వ్యవస్థను వాడుకొని, ఆయా గ్రామాలపై ముప్పేట దాడి చేసి అతి దారుణంగా కిరాతకంగా ప్రవర్తించేవారు వారు చేసే పనులు వారి వెకిలి చేష్టలు మానవమృగాలను తలపించేల జనగాం  దగ్గర లోని బైరాన్ పల్లి గ్రామం మొదలుకొని నల్లగొండలోని రేణుకుంట మరియు గుండ్రంపల్లి , ఆ మొదలు బీబీనగర్ , కర్ణాటక లేని గోర్ఠా ప్రాంతం ఇలా వందల గ్రామాలు రజాకార్ల బాధిత గ్రామాలే ఇంతటితో ఆగకుండా నిజాం నవాబు సహకారంతో రజాకార్లు రోజు రోజుకి హద్దు మీరేవారు,  న్యాయవాదులను నిజాంకు రజాకార్లకు వ్యతిరేకంగా వాదించకూడదని బెదిరించే వారు, న్యాయవాది శ్రీ వినాయకరావు విద్యాలంకార్ నేతృత్వంలో కోర్టుల బహిష్కరణ సైతం చేశారు,  రజాకార్లకు వ్యతిరేకంగా పనిచేసే దళాలకు ఆర్య సమాజ్,  స్టేట్ కాంగ్రెస్ యూనియన్లకు ఆశ్రయం ఇస్తున్నారు అని చెప్పి వ్యవసాయం చేసే రైతులను  సైతం అనేక ఇబ్బందులకు గురి చేసేవారు వారు పండించిన ధాన్యాన్ని అంతా ధ్వంసం చేసేవారు, తగలబెట్టారు లేదా దోచుకెళ్లారు. అంతేగాని వారిని గౌరవ ప్రదంగా వ్యవసాయం సైతం చేసుకొనిచ్చేవారు కాదు అంతేకాకుండా పత్రికల ద్వారా రజాకార్లను నిజాం నవాబును ప్రశ్నిస్తున్నారని తాజ్ అనే వార్తాపత్రికను మరియు రయ్యత్ అనే వార్తా పత్రికలను నిషేధించారు. తదనంతరం షోయబుల్లాఖాన్ అని జాతీయవాది ఇమ్రోజ్ పత్రిక ద్వారా రజాకార్ల ఆగడాలు నిజాం నవాబు ద్వంద వైఖరిని ప్రశ్నించాడు, ఆ సమయంలోనే ఒక కాలరాత్రి లింగం పల్లి చౌరస్తా దగ్గర ఉన్న తన ఇంటికి విధులు ముగించుకుని వెళ్తుండగా తనపై దాడి చేసి గన్నుతో కాల్చి తన రెండు చేతులను నరికి వేసి హత్య చేశారు ఇంతటి పాశవికంగా రజాకార్లు సామాన్య ప్రజలపై న్యాయవాదులపై రైతులపై జర్నలిస్టులపై దాడులు చేసే వారు అయినప్పటికీ నిజామునవాబు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నాడు ఒకవేళ ఎక్కడైనా హిందువులు రజాకార్లకు ఎదురుతిరిగితే రాజద్రోహం నేరం కింద శిక్ష విధించడం చేసేవాడు అప్పటికి ప్రజలు తిరగబడితే తప్పని పరిస్థితుల్లో గ్రామ సమన్వయ కమిటీలు వేసి ఆ సమయానికి ప్రజలను శాంతపరిచే వాడు. కొద్దిరోజుల తర్వాత సమయం చూసి రజాకార్లచే యావత్ గ్రామంపై దాడులు చేయించేవాడు ఆ దాడులు ఎంత భయంకరంగా ఉండేవంటే గతంలో అక్కడ ఆ గ్రామం ఉండేది అనే ఆనవాళ్లు కూడా ఉండేవికావు అంతటి భయంకరంగా రజాకార్లు ప్రవర్తించేవారు. అనేకమంది హిందు యువకులు  నాటి హైదరాబాద్ సంస్థాన ప్రజలు రజాకార్లను సైతం వ్యతిరేకించారు. నిజాం రాజు ద్వంద్వ వైఖరి, రజాకార్ల దమనకాండను వ్యతిరేఖిస్తూ  అనేకమంది ఉద్యమాలు చేశారు, ప్రజలను జాగృత పరిచే వారు కాని చివరికి నయవంచకులైన రజాకార్ల చేతిలో హత్య గావించ బడి అమరులైనారు. అమరులైనవారిలో వరంగల్ జిల్లాకు చెందిన నారాయణ బాబు, గంగారం, జగదీష్ ఆ వరుసలో ముందుంటారు నిజాం నవాబు మీద బాంబుదాడి సైతం చేసి 19 రోజులు నిరాహార దీక్ష చేసి రజాకార్లు ఎన్ని చిత్రహింసలకు గురి చేసిన ప్రాణం ఐతే వదులుతాను గాని నిజాంకు లొంగిపోయే ప్రసక్తే లేదు అని ప్రకటించారు అప్పటికి కూడా వారి వాదన ఒక్కటే మా మాతృభూమికి నిజాం పరమ ద్రోహి నిస్సందేహంగా నిజాంను హత్య చేయాలనే మా ప్రయత్నం, ప్రజలను జాగృతం చేయాలనే మా రెండో ఉద్దేశం. మేం మా కర్తవ్యాన్ని నిర్వహించాం అని ధైర్యంగా చివరి క్షణాల్లో సైతం రజాకార్ల కళ్లలోకి చూసుకుంటూ ఒంట్లో చిన్న బెరుకు కూడా లేకుండా చెప్పారు. మిగతా అమరవీరులు సైతం చివరి క్షణం వరకు ప్రాణాలకు తెగించి పోరాడారే తప్ప ఎవ్వరు కూడా నిజాం రాజు కో రజాకార్లకో భయపడి  లొంగి పోలేదు ఆ జాబితాలో వినాయకరావు విద్యాలంకార్ మొదలుకొని షోయబుల్లాఖాన్ చన్వీర్,  నాగ్నాథ్ పరంజపే,  ఉమ్రీ భామాషా ధన్ జీ, దత్తాత్రేయ ముద్ఖేడ్కర్ లాంటి వారు ఉన్నారు. ఉమ్రీ గ్రామ భామాషా ధన్ జీ  ఉద్యమానికి ఖర్చులను తన భార్య నగలు,తన ఆస్తులను తాకట్టు పెట్టి సహాయం చేసేవాడు. మరి మీ కుటుంబం ఎలా జీవిస్తుంది అని అడిగితే  ఒక్కటే చెప్పేవాడు మన మాతృ భూమికి ఈ నిజాం నవాబ్ నుండి రజాకార్ల దాస్య శృంఖలాల నుండి విముక్తి కలిగితే నా భార్య కాదు నా కుటుంబమే కాదు, వేలాది ప్రజల కళ్ళల్లో ఆనందం చూడవచ్చు ఎందరో జీవితాల్లో వెలుగులు చూడవచ్చు అనేవాడు. వీరికి అనేక రకాల బెదిరింపులు సైతం వచ్చేవి అయితే మీరు మమ్మల్ని పట్టుకెళ్ళి  నిజాంకు రజాకార్లకు అప్పగించగలరు కానీ మీరు అప్పగించేది మమ్మల్ని కాదు మా శవాలను మాత్రమే అనేసరికి సదరు బెదిరింపుదారులు సైతం షాక్ కు గురయ్యారు. వీరే కాకుండా వందేమాతరం రామచంద్రారావు,చీఫ్ ఆర్మర్  హీరాలాల్, ఆనాటి ఏజెంట్ జనరల్ కె.ఎం.మున్షీ కి ఎప్పటికప్పుడు సమాచారం అందించే వారు దాని కారణంగానే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు భారత సైన్యం ద్వారా హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్ లో విలీనం చేయగలిగారు హైదరాబాద్ సంస్థానానికి విముక్తిని ప్రసాదించగలిగారు. ఇవే కాకుండా బైరాన్ పల్లి లో ఇక్బాల్ హషీం అనే రజాకారు  చేసిన మారణకాండ అంతా ఇంతా కాదు. ఒక శవాల బావినే ఏర్పరిచారు, భైరాన్పల్లి బురుజు దగ్గర ఇప్పటికీ ఆ ఆనవాళ్ళు  అలానే మిగిలి ఉన్నాయి. రేణిగుంటలో చింతలపూడి రామ్ రెడ్డి సైతం రజాకార్లను ప్రతిఘటించి యుద్ధం చేసినప్పటికీ చివరికి రజాకార్లు చేయాలనుకున్న నష్టాన్ని చేశారు, మొత్తం గ్రామాన్ని అగ్నికి ఆహుతి చేశారు. బీబీ నగర్ లో కూడా రజాకార్లు గ్రామ దోపిడీ చేస్తూ కనిపించిన వారిని కనిపించినట్టు గా చంపి భయంకరమైన మారణకాండను సృష్టించారు. బీబీనగర్ సంఘటనకు మూల కారణం ఖాసీం రజ్వీ తమ్ముడు తయ్యబ్ రజ్వీ.స్త్రీల మాన ప్రాణాలను సైతం వదల్లేదు తయ్యబ్ రజ్వీ. వరంగల్ లోని సుబేదారిలో హబీబుల్లాఖన్ అనే మతోన్మాది రజాకార్ మానవత్వం లేకుండా అప్పటివరకు వైద్యం చేసి వస్తున్న డాక్టర్ నారాయణ రెడ్డి బృందాన్ని హత్య చేశాడు. ఇవే కాకుండా ఎన్నో ఆకృత్యాలు జరిగాకే, ఎన్నో గ్రామాల ఆనవాళ్లు కోల్పోయాకే, ఎన్నో త్యాగాల మూల్యం చెల్లించాకే

12, సెప్టెంబర్ 1948న భారతీయ సైన్యాలు సంస్థానం లోకి ప్రవేశించాయి, నిజాం వారితో యుద్ధం చేసే ప్రయత్నం చేశాడు. భారత సైన్యం నిజాం దగ్గర నిజాం కవ్వింపు చర్యలు సాగకపోయేసరికి  17 సెప్టెంబర్ 1948 న నిజాం నవాబు నాటి భారత ఉప ప్రధాని ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ దగ్గర లొంగిపోయాడు. ఆ క్షణం నుండి హైదరాబాద్ సంస్థానానికి నిజాం పాలన నుండి రజాకార్ల అకృత్యాలు నుండి విముక్తి లభించింది హైదరాబాద్ సంస్థానం విమోచనం  పొందింది.  ఆ తర్వాత కె.ఎం.మున్షీ దగ్గరున్న గూఢచారులు అందించిన సమాచారం ప్రకారం ఖాసిం రజ్వీ తన తమ్ముడు తయ్యబ్ రజ్వి లను భారత ప్రభుత్వం అరెస్టు చేసి జైలుకు పంపిన తదనంతరం రజాకార్లు కొంతమంది లొంగిపోయారు. కొంతమంది పారిపోయారు. కావున ఇంతటి గొప్ప చరిత్ర కలిగిన ఎన్ని విధ్వంసాలు జరిగిన తర్వాత హైదరాబాద్ సంస్తానానికి విమోచనం  కలిగిన ఆ రోజును సెప్టెంబర్ 17ను నాటి అమరవీరుల త్యాగ ఫలితంగా గుర్తించి తెలంగాణ ప్రాంతంలో కూడా మహారాష్ట్ర మరియు కర్ణాటకలో జరుగుతున్నట్లుగా తెలంగాణ విమోచన దినోత్సవంను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి తద్వారానే ఆ అమరవీరులకు సరైన నివాళిని అందజేసినవారమవుతామని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. అంతేగాని మైనార్టీల సంతుష్టీకరణ కొరకు ఓటు బ్యాంకు రాజకీయాల కొరకు ఎంఐఎం మద్దతు కొరకో నేనే నిజం వారసుడిని అని,  నిజాం గొప్ప రాజు అని కీర్తించడం వంటి పిచ్చి ప్రేలాపనలు మానుకోవాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కు తెలంగాణ ప్రజలు హితవు పలుకుతున్నారు. నిజాంను కీర్తించడం ఇదే విధంగా కొనసాగితే తెలంగాణ రాష్ట్ర మెజారిటీ  ప్రజల ఆగ్రహావేశాలకు గురికాక తప్పదని తెలంగాణ ప్రజలు హెచ్చరిస్తున్నారు. చివరిగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ సభ్యసమాజం డిమాండ్ చేస్తున్నది.

అభిప్రాయాలు వ్యాసకర్త వ్యక్తిగతం

వ్యాసకర్త

Javvaji Dileep MTech, JNTUH
Social Activist
7801009838

Previous Article

BJP WOULD FORM NEXT GOVERNNENT IN TELANGANA: JAVADEKAR

Next Article

Centre gave funds Liberally to Develop Telangana: Bandi Sanjay

You may also like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

four × 3 =