Latest

రాష్ట్ర సీఎం ఢిల్లీ పర్యటన ఎందుకోసమే స్పష్టత ఇవ్వాలి. ప్రజలలో సందేహాలు, అపోహలు ఉన్నాయి: బండి సంజయ్ , తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు

ఢిల్లీ లో యుద్ధం చేస్తానని ప్రకటించిన సీఎం కేసీఆర్ ఏ గల్లీలో కత్తి తిప్పాడో సమాధానం చెప్పాలి

సీఎం ఢిల్లీ లో పొర్లు దండాలు పెట్టిన ఆయన అవినీతి పై విచారణ ఆగదు. త్వరలో జైలుకు వెళ్లడం ఖాయం

ప్రజల దృష్టి మరల్చడానికి ఢిల్లీ పర్యటన కు వచ్చాడు.

రాష్ట్ర రైతాంగం , ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉండడంతో కేసీఆర్ రైతుల ఆందోళనకు వెళ్లలేదు.

హైదరాబాద్ వరదలు వచ్చినప్పుడు బయటకు రాని సీఎం కేసీఆర్ , ఇప్పుడు ఢిల్లీ వచ్చి వరద సహాయం అడుగుతున్నాడు

ప్రజాధనం దుర్వినియోగం చేయడానికే కాళేశ్వరం లో మూడవ టీఎంసీ కు అనుమతి అడుగుతున్నాడు. డిపీఆర్ సమర్పించకుండా అనుమతి అడుగుతున్నారు.

కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేసి రాజకీయ లబ్ది పొందే ప్రయత్నం చేస్తున్నాడు.

32 వేల కోట్లతో రెండవ దశకు అనుమతి తీసుకుని 82 వేల కోట్ల అంచనాలకు పెంచారు. ఎందుకు అంచనాలు పెంచారో సమాధానం చెప్పడం లేదు. పైగా మా నిధులు మా ఇష్టం అంటూ ఎదురుదాడి చేస్తున్నాడు.

మూడవ టీఎంసీ పేరుతో సరికొత్త డ్రామాకు తెరలేపారు. కేంద్ర జలశక్తి మంత్రికి ఒక లేఖ, సెంట్రల్ వాటర్ కమీషన్ కు మరో లేఖ రాసారు.

కాంట్రాక్టర్ల జేబులు నింపడానికే కాళేశ్వరంలో మూడవ టీఎంసీ కి అనుమతి అడుగుతున్నారు. రాష్ట్రంలో లక్షల కోట్ల అవినీతి జరుగుతుంది. దానిని కప్పిపుచ్చుకోవడానికే ఢిల్లీ వచ్చి వంగి వంగి దండాలు పెడుతున్నారు .

కాళేశ్వరం మూడవ టీఎంసీ పాత ప్రాజెక్ట్ అని రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా చెప్పి , డిపీఆర్ అనుమతి అవసరం లేదు అని చెప్పి, ఒక్క ఎకరానికి నీరు ఇవ్వనప్పుడు అనుమతులు ఎందుకు అని కేంద్రం అడుగుతుంది

గోదావరి నదీజలాల ట్రిబ్యునల్ ఏర్పాటుకు ఎందుకు లేఖ ఇవ్వడం లేదు, కృష్ణా ట్రిబ్యునల్ విషయంలో సుప్రీంకోర్టు లో కేసు ఎందుకు ఉపసంహరించుకోలేదు?

వరంగల్ ను కేంద్రం స్మార్ట్ సిటీగా ప్రకటించి 196 కోట్లు నిధులు విడుదల చేస్తే , రాష్ట్ర ప్రభుత్వ వాటాగా మరో 196 కోట్లు విడుదల చేయలేదు. కేంద్రం ఇచ్చిన 196 కోట్లలో నిధులు దారి మళ్లించి అందులో 40 కోట్లు మాత్రమే విడుదల చేసారు.

కేంద్ర వాటాకు సంబంధించిన లెక్కల కోసం మూడు సార్లు లేఖ రాస్తే , రాష్ట్ర ప్రభుత్వం నుండి స్పందన లేదు. కేసీఆర్ వైఖరి వల్ల, ఆయన నిర్లక్ష్యం వల్ల వరంగల్ , కరీంనగర్ స్మార్ట్ సిటీల దాదాపు 1000 కోట్లు నిధులు రాలేదు.

రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధిపేట విమానాశ్రయం ప్రకటన సోషల్ మీడియా లో పెద్ద జోక్ గా మారింది.

కేసీఆర్ ఢిల్లీ పర్యటన అట్టర్ ప్లాప్. ఆయన చెప్పిన కట్టుకథలు కేంద్ర మంత్రులు నమ్మలేదు. ఆయన పాచిక పారలేదు.

రాష్ట్రంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తానని ఇప్పుడు మాట్లాడడం లేదు. ముందు ఉద్యోగులకు ప్రమోషన్ లు ఇచ్చి, కొత్త ఉద్యోగుల భర్తీ చేపట్టాలి .

72 వేల కోట్ల నిరుద్యోగ భృతి వెంటనే చెల్లించాలి. మొన్నటి ఢిల్లీ పర్యటనలో ఢిల్లీ లో కేంద్ర మంత్రులు, ప్రధానితో ఏం మాట్లాడలేదు అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు సంజయ్

Have your say

1 × five =