ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లా రామతీర్థం ఘటన పై రగడ కొనసాగుతోంది.

Author: Share:

రామతీర్థం క్షేత్రంలోని శ్రీరామునికి జరిగిన అవమానాన్ని పరిశీలించటానికి వెళ్తున్న ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, జనసేన నాయకులు, కార్యకర్తలను విశాఖపట్నం నుంచి విజయనగరం వెళ్లే దారిలో ప్రధాన కూడళ్లలో భారీగా మోహరించిన పోలీసులు ఎక్కడికక్కడ బీజేపీ, జనసేన నేతలను అడ్డుకున్నారు. పోలీసుల వలయాలను దాటుకుంటూ నెలిమర్ల జంక్షన్ కు చేరుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎంపీ జీవీఎల్ నరసింహారావు, జాతీయ కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, ఇతర ముఖ్యనేతలను పోలీసులు అడ్డుకున్నారు.

దేవుడుకి జరిగిన అన్యాయం పై ప్రశ్నించడానికి వెళ్తున్న వారిని ఆపడం అడ్డుకోవడం హేయమైన చర్య అని తెలిపారు సోము వీర్రాజు. యావత్ హిందూ సమాజం ఈ దగుల్బాజీ రాష్ట్ర ప్రభుత్వం గురించి తెలుసుకోవలసిన రోజు అని పేరుకొన్నారు.

దేశంలో శ్రీరాముని ఆలయం లేని గ్రామం లేదు,శ్రీరాముని చిత్రపటం లేని పూజా మందిరం లేదు. ప్రతి గ్రామంలోనూ, ప్రతి హిందువు గృహంలోనూ ప్రతి నిత్యం హిందువులంతా ఎంతో పవిత్రంగా కొలిచేటువంటి శ్రీరామునికి నేడు అవమానకర సంఘటన జరగడం బాధాకరమని తెలిపారు.

ఎంతో పురాతన ప్రాశస్థ్యం కలిగినటువంటి రామతీర్థం క్షేత్రంలోని శ్రీరాముని విగ్రహం యొక్క శిరస్సును కొంతమంది దుండగులు ఖండిస్తే,ఆ దుండగులను పట్టుకోవడం మీద రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టకుండా మమ్మల్ని అడ్డుకోవడం ఏంటి అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

పోలీసులకు నాయకులకు జరిగినా తోపులాట ఘటనలో బిజెపి నేత విష్ణువర్ధన్ రెడ్డి తీవ్ర ఆస్వస్థతకు గురయ్యారు. ఆయనను తొలుత మహారాజ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందించారు. విష్ణువర్ధన్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, ప్రస్తుతం ఆయనకు చికిత్స అవసరమని వైద్యులు చెబుతున్నారు.

గత మూడు రోజులుగా సంఘటన జరిగిన ప్రదేశానికి వెళ్ళి, పరిశీలించటానికి ప్రయత్నం చేస్తున్న బీజేపీ – జనసేన నాయకులను, కార్యకర్తలను నిర్దాక్షిణ్యంగా అడ్డుకొని అమానుషంగా ప్రవర్తించడం ఈ జగన్ ప్రభుత్వానికే చెల్లింది అని తెలిపారు.

Previous Article

కేటీఆర్‌ను సీఎం చేయడం కేసీఆర్‌కు ఇష్టం లేదు

Next Article

జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత 2019 నుండి హిందూ దేవాలయల పై దాడుల వివరాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

five × 5 =