బీజేపీ కార్యకర్తలు పై ఉగ్రవాదుల దాడులు.

Author: Share:

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు దారుణానికి పాల్పడ్డారు. కుల్గాంలోని వైకే పొరా గ్రామంలో కారులో ప్రయాణిస్తున్న భాజపా కార్యకర్తలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయాలపాలైన వారిని చికిత్సనిమిత్తం ఆస్పత్రికి తరలించగా అప్ప‌టికే మృతిచెందిన‌ట్లు వైద్యులు తెలిపారు

ఈ ఘటనలో ముగ్గురు బీజేపీ కార్యకర్తలు మృతిచెందినట్టు పోలీసులు వెల్లడించారు.

ప్రాణాలు కోల్పోయినవారి వివరాలు: వైకె పోరా నివాసి బీజేపీ జిల్లా యువజన ప్రధాన కార్యదర్శి గులాం అహ్మద్ యాటూ కుమారుడు ఫిదా హుస్సేన్ యాటూ, సోఫర్ దేవ్‌సర్ నివాసి అబ్దుల్ రషీద్ బీగ్ కుమారుడు ఉమర్ రషీద్ బీగ్, వైకె పోరా నివాసి మొహద్ రంజాన్ కుమారుడు ఉమర్ రంజాన్ హజామ్‌గా పోలీసులు గుర్తించారు

ఘటన ప్రాంతాన్నంతటినీ తమ ఆధీనంలోకి తీసుకొని భద్రతా దళాలతో కలిసి గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు

Previous Article

80% కరోనా పేషెంట్స్ రక్తంలో అదే లోపం ?

Next Article

లైసెన్స్, రిజిస్ట్రేషన్ లేకుండా ఇంట్లో తయారుచేసిన ఆహార పదార్థాలను అమ్ముతున్నారా? మీకు 5 లక్షల రూపాయల జరిమానా, ఆరు నెలల వరకు జైలు శిక్ష ఉంటుంది.

You may also like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

10 − 1 =