సెప్టెంబర్ 17 తెలంగాణవిమోచన దినోత్సవాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలి – దుగ్యాల ప్రదీప్

Author: Share:


1947 ఆగస్టు 15న బ్రిటిష్ వారి పాలన అంతమై భారతదేశమంతటా స్వాతంత్ర్య సంబరాలు జరుపుకున్నారు.. కానీ దేశం నడి బొడ్డున ఉన్న హైదరాబాద్ సంస్థాన ప్రజలకు ఆ అదృష్టం లేకుండా పోయింది. అప్పటి వరకూ బ్రిటిష్ వారికి సామంతుడిగా ఉన్న హైదరాబాద్ నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ తాను కూడా స్వతంత్రుడిని అయ్యానని ప్రకటించుకున్నాడు. హైదరాబాద్ అటు ఇండియాలో, ఇటు పాకిస్తాన్లో కలవదని స్వతంత్రంగా ఉంటుందని ప్రకటించాడు.

కానీ సంస్థానంలోని ప్రజలు తాము భారతదేశంలో కలవాలని కోరుకున్నారు. ఆనాటి హైదరాబాద్ సంస్థానంలోని తెలంగాణ, మరాఠ్వాడా, కర్ణాటక ప్రాంతాల్లో ఇంకా ప్యూడల్ పాలన కొనసాగుతోంది. ఒకవైపు దేశ్ముఖ్, జాగీర్దార్, దొరల వెట్టి చాకిరిలో గ్రామీణ ప్రజానీకం మగ్గిపోతుంటే, మరోవైపు నిజాం అండతో రజాకార్లు చెలరేగిపోయారు.. ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. గ్రామాలపై పడి ప్రజలను దోచుకొని, హత్యాకాండను కొనసాగించారు.హైదరాబాదు సంస్థానంలో ప్రస్తుత తెలంగాణాతో పాటు మరాఠ్వాడ (మహారాష్ట్ర), బీదర్ (కర్ణాటక) ప్రాంతాలు ఉండేవి.

3 భాషా ప్రాంతాలకు చెందిన మొత్తం 16 జిల్లాలకు గాను 8 జిల్లాలు తెలంగాణా ప్రాంతానికి చెందినవి కాగా, మరాఠా, కన్నడ ప్రాంతాలకు చెందినవి 8 జిల్లాలుండేవి. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిననూ నిజాం సంస్థానంలోని ప్రజలకు మాత్రం స్వాతంత్ర్యం లేకపోవడాన్ని ఇక్కడి ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. దేశమంతటా స్వాతంత్ర్యోత్సవాలతో ప్రజలు ఆనందంతో గడుపుచుండగా నిజాం సంస్థాన ప్రజలు మాత్రం నిరంకుశ బానిసత్వంలో కూరుకుపోయారు. హైదరాబాదు రాజ్యాన్ని పాలిస్తున్న ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ రాజ్యాన్ని సొంతం చేసుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తూ రజాకార్లను ఉసిగొల్పాడు.

నిజాంకు అండగా ఖాసిం రజ్వీ నేతృత్వంలోని రజాకార్లు గ్రామాలపైబడి దోపిడిచేయడం, ఇండ్లు తగలబెట్టడం నానా అరాచకాలు సృష్టించారు.అతని మతోన్మాద చర్యలు కోరలాల్చి వెయ్యి నాల్కలతో విషంకక్కాయి. హీనమైన బతుకులు వెళ్ళదీస్తున్న జనం గురించి అస్సలు పట్టించుకోకుండా ప్రజల నుండి బలవంతంగా వసూలుచేసుకున్న సొమ్ముతో విలాసాలు, జల్సాలు, భోగభాగ్యాలు చేసుకొనేవారు. ఇప్పుడు ఉన్న తెలంగాణలోని సుమారుగా అన్నీ జిల్లాల్లో నిజాం నావబు,రాజకారుల ఆఘయిత్యాలకు నిలుటద్దంలా వరంగల్ రూరల్ జిల్లలోని పరకాల ఆమరదామం, సిద్దిపేటలో వీర బైరాన్ పల్లి,భువనగిరి,అదిలాబాద్ లో గొండుమర్రీ గ్రామంలో మర్రిచెట్టుకీ వేయి మందిని ఉరి తీయడం జరిగింది. కరీంనగర్ హుస్నాబాద్ లో మహ్మద్పల్లి, భువనగిరిలో, ఖమ్మంలో, నల్గొండ, పాలమూరు ఇలా చాలా ప్రదెశాలలో అనేక మంది నిజాంకు,రాజకారులకు వ్యతిరేకంగా మట్లాడినా, ఉద్యమాలు చెసిన విచక్షణ రహిత హత్యచెసిన ఘటనలు ఉన్నాయి.

సైనిక చర్య విజయవంతం కావడానికి అప్పటి భారత హోంశాఖా మంత్రి సర్దార్ పటేల్ కృషి ఎంతో ఉంది. సర్దార్ వల్లభ్ భాయిపటేల్ రాజకీయ చతురతతో పోలీసు చర్య జరిపి నిజాం పాలనకు చరమగీతం పలికాడు. హైదరాబాదును ప్రత్యేక దేశంగా ఉంచాలని కనీసం పాకిస్తాన్‌లోనైన విలీనం చేయాలని విశ్వప్రయత్నం చేసిన నిజాం పన్నాగాలను పటేల్ బద్దలు కొట్టాడు. నిజాం ఐక్యరాజ్య సమితికి భారతదేశంపై ఫిర్యాదు చేయడానికి దూతలను కూడా పంపాడు. భారతదేశంపై పోరాటానికి విదేశాల నుంచి ఆయుధ దిగుమతికి ప్రయత్నాలు చేశాడు. అయినా అతని ఆటలు, నిజాం ప్రధాని లాయక్‌అలీ నాటకాలు పటేల్ ఎదుట పనిచేయలేవు. పోలీసు చర్యలో భాగంగా నలువైపులా నుంచి వస్తున్న భారత బలగాలను చూసి నిజాం కింగ్‌కోఠి నుంచి బయటకు వచ్చి భారత ప్రతినిధి కె.ఎం.మున్షీని కలిశాడు. అప్పటికే సమాచారసాధనాలు తెగిపోవడంతో ఎటూ అర్థంకాక కాళ్ళబేరానికి దిగాడు. లొంగుబాటుకు మించిన తరుణోపాయం లేదను మున్షీ చెప్పడంతో నిజాం ఒప్పుకోకతప్పలేదు.

బొల్లారం వద్ద నిజాం నవాబు సర్దార్ పటేల్ ఎదుట తలవంచి లొంగిపోవడంతో 1948 సెప్టెంబరు 17న హైదరాబాదు రాజ్యం భారత యూనియన్‌లో విలీనమైంది. అప్పుడు ఇక్కడి ప్రజలకు అసలైన స్వాతంత్ర్యం లభించింది. తెలంగాణ ఉద్యమ సమయంలో (సిఎం) కేసీఆర్ గారు అనేక సభలో మాట్లాడుతూ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ప్రగల్బాలు పలికారు. కానీ నేడు అధికారంలోకి వచ్చి ఆరు సంవత్సరాలు అయినా కూడా, తెలంగాణ ప్రాంతం స్వతంత్రాన్ని అందిపుచ్చుకున్న రోజును అధికారికంగా నిర్వహించకపోవడం అత్యంత బాధాకరం. పక్కన ఉన్న మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాలలో ఉన్న ఎనిమిది జిల్లాలో సెప్టెంబర్ 17న ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నాయి.

కానీ,సెప్టెంబరు 17 రోజు బానిసలుగా ఉన్న తెలంగాణ ప్రజలు నిజాం నవాబు పాలన నుండి విముక్తి పొందిన రోజును విమోచన దినోత్సవంగా రాష్ట్రప్రభుత్వం, ఈ సంవత్సరమైనా అధికారికంగా నిర్వహించి నిజాం నవాబు కాలంలో అమరులైన వేలాది నాయకులను స్మరించుకోవాలని బిజేపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిజాం నవాబు పాలన క్రమంలో తెలంగాణ ప్రజలు పడ్డ ఇబ్బందులను, చరిత్ర మొత్తం కూడా పాఠ్యాంశాలలో చేర్చి చరిత్రను తెలియజేసే విధంగా ఉంచాలని, లేనియెడల 2023 లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రకటన “తెలంగాణ విమోచన దినోత్సవం” పైనే ఉంటుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.

జై తెలంగాణ! భారత్ మాతకి జై!!
“తెలంగాణ విమోచన” ఉద్యమాబి వందనాలతో

దుగ్యాల ప్రదిప్ కూమార్
ప్రధాన కార్యదర్శి
తెలంగాణ బిజేపీ రాష్ట్ర శాఖ

Previous Article

తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ ఎండీల మధ్య చర్చలు విఫలం

Next Article

When a clueless man became the Prime Minister of India courtesy Nepotism

You may also like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

19 − nine =