తెలుగు

GHMC – 30 డివిజన్లలో డిపాజిట్లు కోల్పోయిన టీఆర్ఎస్

GHMC – 30 డివిజన్లలో డిపాజిట్లు కోల్పోయిన టీఆర్ఎస్

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అధికార టీఆర్​ఎస్​కు కోలుకోలేని దెబ్బే తగిలింది. అది కూడా తన దోస్త్​పార్టీ ఎంఐఎం నుంచే ఎదురైంది. గతంలో గెలిచినా స్థానాల కన్నా దాదాపు సగం స్థానాలే కైవసం చేఉకోవడమే కాకుండా 30 డివిజన్ లలో డిపాజిట్లు కోల్పోయింది.

గత ఎన్నికలలో స్వల్ప మెజార్టీలో ఓటమి పాలైన డివిజన్ లలో సహితం డిపాజిట్లు కోల్పోయారు. ముఖ్యంగా పాత బస్తీలో ఎంఐఎంకు గట్టి పోటీ ఇచ్చి, రెండు స్థానంలో గణనీయంగా ఓట్లు సంపాదించుకున్న పార్టీకి ఇప్పుడు అక్కడ దాదాపు శృంగభంగమైంది. ఇక్కడ గతంలో టీఆర్​ఎస్ గెలుపొందిన ఏడు డివిజన్ లను ఈ సారి బిజెపి గెల్చుకోవడమే కాకుండా, చాలా డివిజన్ లలో ఎంఐఎంకు గట్టి పోటీ ఇచ్చింది.

అజంపురా, చావ్​నీ, డబీర్​పురా, పత్తర్​ఘట్టీ, మొఘల్​పురా, తలాబ్​చంచలం, లలితాబాగ్​, కుర్మగూడ, సంతోష్​ నగర్​, రియాసత్​నగర్​, కంచన్​బాగ్, బార్కాస్​, చాంద్రాయణగుట్ట, ఉప్పుగూడ, ఫలక్​నుమా, నవాబుసాహెబ్​ కుంట, శాలిబండ, ఘాన్సీబజార్​, పురానపూల్​, దూద్​బౌలి, జహనుమా,రామ్నాస్త్​పురా, దత్తాత్రేయనగర్​, టోలిచౌకి, నానల్​నగర్​,మెహిదీపట్నం,ఆసిఫ్​నగర్​, విజయనగర్​ కాలనీ, మల్లేపల్లి,షేక్​ పేట్​డివిజన్లలో అధికార పక్షం డిపాజిట్లు కోల్పోయింది.

షాదీ ముబారక్ స్కీమ్​తో ఎంతో మంది ముస్లింలు లబ్ధిపొందుతున్నారని, తమ గెలుపునకు ఆ స్కీమ్​ ఉపయోగపడుతుందని ఆశించిన అభ్యర్థులకు ఆశాభంగమైంది. మొత్తం మీద 26 స్థానాలలో టీఆర్​ఎస్ ను మూడో స్థానంకు త్రోసివేసి, బిజెపి రెండు స్థానంలోకి వచ్చింది.

నగరంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గ్రేటర్‌తో పాటు శివారులోని చాలా ప్రాంతాలు జలమయ్యాయి. ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. అధికార పార్టీ నేతలు సహాయక చర్యల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఎన్నికల ఫలితాలపై పడింది.

ముంపు ప్రాంతాలు గల చైతన్యపురి, హబ్సిగూడ, రామంతాపూర్, చంపాపేట, నాగోలు, సరూర్‌నగర్, గడ్డి అన్నారం, హయత్‌నగర్, వనస్థలిపురం, లింగోజీగూడ, హస్తినాపురం, మన్సూరాబాద్, మైలార్‌దేవ్‌పల్లి, జీడిమెట్లలో బీజేపీ విజయకేతనం ఎగరవేసింది.

Source
Nijamtoday.com

Have your say

15 − 13 =