ప్రపంచాన్ని ప్రతి వందేళ్లకో మహమ్మారి పట్టి పీడిస్తున్నట్లు కనిపిస్తోంది

Author: Share:

ప్రపంచాన్ని ప్రతి వందేళ్లకో మహమ్మారి పట్టి పీడిస్తున్నట్లు కనిపిస్తోంది. 1720లో ప్లేగు వ్యాధి ప్రబలింది. 1820లో కలరా కాటే సింది. 1920లో స్పానిష్‌ ఫ్లూ పంజా విసరింది. తాజాగా కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఐతే ఇది యాదృచ్ఛికమా? లేక అంతుచిక్కని కారణాలు ఏమైనా ఉన్నాయా? వాయిస్ ఓవర్‌ కాలనుగుణంగా ప్రపంచంలో కొన్ని మార్పులు వస్తుంటాయి.

ఐతే ఆ మార్పు సహజంగా జరిగితే పెద్ద ఇబ్బందేమీ ఉండదు. అసహజం, ప్రకృతి విరుద్ధం అయినప్పుడే సమస్య వస్తుంది. ఆ సమస్య ఏ రూపంలోనైనా రావొచ్చు. వైరస్‌లు రూపంలో భయంకరంగా కాటేయొచ్చు. ఆ వైరస్‌లలో కరోనా వైరస్ మొదటిదీ కాదు, చివరిదీ కాదు. గతంలోనూ ఎన్నో వ్యాధులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడాయి. లక్షలాదిమందిని బలి తీసుకున్నాయి. వేలాదిమందిని ఆస్పత్రుల పాల్జేశాయి. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు పోలిక రావడం సహజ. కరోనా కల్లోలం నేపథ్యంలో అదే జరుగుతోంది.

ప్రతి వందేళ్లకు ఓ మహమ్మారి ప్రపంచంపై దాడి చేస్తోందంటూ ప్రచారం జరుగుతోంది. అందుకు సంబంధించిన కథనాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 1720లో ప్లేగు వ్యాధి ప్రబలింది. 1820 లో కలరా రక్కసి కాటేసింది. 1920లో స్పానిష్ ఫ్లూ పంజా విసిరింది. ఇప్పుడు, 2020లో కరోనా వణికిస్తోంది. ఈ నాలుగు సందర్భాల్లో సంవత్సరాల మధ్య తేడా వంద కావడం గమనార్హం.

ది గ్రేట్ ప్లేగ్ ఆఫ్ మార్సిల్లే…. ఫ్రాన్స్‌ను వణికించిన మహమ్మారి ఇది. మార్సిల్లీ ప్రాంతాన్ని ప్లేగ్ వ్యాధి పట్టి పీడించింది. 1718 ప్రాంతంలో అంటుకున్న ప్లేగు వ్యాధి రెండేళ్లలో తారాస్థాయికి చేరింది. మా ర్సిల్లీ నగరం శవాల దిబ్బగా మారిపోయింది. రెండేళ్లలో ఒక్క మార్సిల్లీలోనే దాదాపు 50 వేల మంది చనిపోయారు. వ్యాధి తీవ్రత భయకంరంగా ఉండడంతో అత్యంత కఠినమైన ఆంక్షలు విధించారు.

మార్సిల్లీ నుంచి ఫ్రాన్స్‌లోని ఇతర ప్రాంతాలకు సంబంధాలను కట్ చేశారు. మార్సిల్లీ ప్రజలు ఇతర ప్రాంతాల వారితో మాట్లాడితే ఉరిశిక్ష విధిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఐనప్పటికీ ప్లేగు వ్యాధి విస్తరణ ను అడ్డుకోలేకపోయారు. మార్సిల్సీ పరిసర ప్రాంతాల్లోనూ ప్లేగు వ్యాధి విలయతాండవం చేసింది. ఫలితంగా మరో 50 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా లక్ష మందిని ప్లేగు వ్యాధి బలి తీ సుకుంది. ఐతే, ఎంత వేగంగా ప్రబలిందో అంతే వేగంగా తగ్గిపోయింది. మార్సిల్లీ నగరం కూడా ప్లేగు దెబ్బ నుంచి త్వరగానే కోలుకుంది.

1820లో కలరా విజృంభించింది. ఆసియా, యూరప్, అమెరికా ఖండాలు అల్లాడిపోయాయి. బ్యాక్టీరియాతో కలుషితమైన నీటిని తాగడం వల్ల కలరా వ్యాపించింది. ముందుగా మనదేశంలోని గంగా తీర ప్రాంతాల్లో కలరా అంటుకుంది. 1817లో బెంగాల్‌లో వ్యాధి ఛాయలు కనిపించాయి. జెస్సోర్‌లో తొలి కలరా కేసు నమోదైంది. బిహార్‌లోని పూర్ణియా, ఆ తర్వాత బెంగాల్‌లోని కలకత్తా, అనంతరం మహారాష్ట్రలోని బాంబేలో కలరా స్వైర విహారం చేసింది. ప్రజలు పిట్టలు రాలినట్లు రాలిపోయారు. భారతదేశంలో మరణమృదంగం మోగించిన కలరా, విదేశాల్లోనూ ప్రతాపం చూపించింది. బ్యాంకాక్, మనీలా, జావా, ఒమన్, చైనా, జపాన్, పర్షియన్ గల్ఫ్ దేశాలను కలరా గడగడలాడించింది. ఒక్క థాయ్‌లాండ్‌లోనే 30 వేల మంది చనిపోయారు. ఫిలిప్పీన్స్‌లోనూ వేలాదిమంది మృతి చెందారు. మనదేశంలోనూ వందలామంది ప్రాణాలు కోల్పోయారు. ప్ర పంచవ్యాప్తంగా ఎంత మంది చనిపోయారో లెక్కే లేదు. 1817 నుంచి 1824 వరకు దాదాపు ఏడేళ్ల పాటు ప్రపంచాన్ని కలరా ఆటాడుకుంది.

మరో వందేళ్లకు అంటే 1920లో స్పానిష్ ఫ్లూ పంజా విసిరింది. వాస్తవానికి 1917లోనే స్పానిష్ ఫ్లూ లక్షణాలు బయటపడ్డాయి. 1918-19ల్లో ఫ్లూ విస్తరించింది. అంతకంతకూ పెరిగి ప్రాణాంతక మహ మ్మారిగా మారిపోయింది. ప్రపంచంలోనే కనీవినీ ఎరుగని మారణహోమానికి దారి తీసింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 కోట్ల మందిపై హెచ్‌ 1 ఎన్‌ 1 నింజా వైరస్ ఎఫెక్ట్ చూపించింది. ఆ వైరస్ సోకిన వారిలో 10 నుంచి 20 శాతం మంది మరణించి ఉంటారని అంచనా. స్పానిష్ ఫ్లూ కారణంగా కనీసం 5 కోట్లమంది మృతి చెందారని సమాచారం. కొందరైతే, దాదాపు 10 కోట్ల మంది ప్రాణాలు కోల్పో యారని లెక్కలు కట్టారు. మొత్తానికి ప్రపంచ జనాభాలో 2 నుంచి 3 శాతం ప్రజలను స్పానిష్ ఫ్లూ బలి తీసుకుంది.

స్పానిష్ ఫ్లూ విజృంభణ తర్వాత మరో వందేళ్లు గడిచిపోయాయి. ఈ శతాబ్దకాలంలో ఎన్నో రకాల వైరస్‌లు దాడి చేశాయి. ఆంత్రాక్స్, ఎబోలా, నిఫా, చికెన్ గున్యా, డెంగ్యూ వ్యాధులు ప్రజలను బెంబేలెత్తించాయి. ఐతే, ఎప్పటికప్పుడు కొత్త మందులు కనుక్కుంటూ ఆ వ్యాధులను అరికడుతూ వచ్చారు. ఇలాంటి సమయంలో కరోనా వైరస్ తెరపైకి వచ్చింది. రావడం రావడమే ప్రాణాంతక వైరస్ గా దాడి చేసింది. ఇప్పటికే ఒక్క చైనాలోనే వందలమంది ప్రాణాలు కోల్పోయారు. వేలమంది ఆస్పత్రుల్లో చేరారు. విదేశాల్లోనూ వేగంగా వ్యాపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మృతుల సంఖ్య పెరుగుతోం ది. గత వైరస్‌లతో పోలిస్తే కరోనా భయంకరమైనదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కరోనా దెబ్బకు ఆరున్నర కోట్ల మంది ప్రాణాలు కోల్పోతారని అంటున్నారు.

Author:
KB RANJAN KUMAR

Previous Article

Women with no travel history Dies after displaying Corona symptoms

Next Article

Aabhas Maldahiyar schools Ramchandra Guha on Faith and Astrology

You may also like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

two − one =