Local

వరంగల్ అర్బన్: శ్రీనివాస్ త్వరగా కోలుకోవాలని భద్రకాళి అమ్మవారికి పూజలు చేసిన వరంగల్ బీజేపీ అధ్యక్షురాలు రావు పద్మ.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను ఇటీవల అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ బీజేపీ కార్యకర్త శ్రీనివాస్ రాష్ట్ర బీజేపీ కార్యాలయం ముందు ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న విషయం తెలిసందే. దీన్ని గమనించిన స్థానికులు వెంటనే సమీపంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. శ్రీనివాస్ ‌కు 40 శాతం గాయాలు అయినట్టు తెలుస్తోంది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆత్మాహుతి కి పాల్పడ్డ శ్రీనివాస్ త్వరగా కోలుకోవాలని ఈ రోజు భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి రావు పద్మ గారి అధ్వర్యంలో పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ యెక్క కార్యక్రమంలో బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లాకి చెందిన రాష్ట్ర నాయకులు, జిల్లా పద్ధాదికరులు , మొర్చల అధ్యక్షులు, మండల, డివిజన్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

Have your say

12 − eight =