మంత్రి గంగుల కమలాకర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం!

Author: Share:

మంత్రి గంగుల కమలాకర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం
నగర గంగపుత్ర సంఘం అధ్యక్షులు పల్లికొండ అన్నయ్య

మంత్రి గంగుల కమలాకర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని నగర గంగపుత్ర సంఘం అధ్యక్షులు పల్లికొండ అన్నయ్య తీవ్రంగా మండిపడ్డారు ఈ మేరకు శుక్రవారం నగరంలోని కేర్ డిగ్రీ కళాశాలలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

మంత్రి గంగుల కమలాకర్ గురువారం కరీంనగర్ జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. చేపలు పట్టే వారు ముదిరాజులు అన్నట్లు మాట్లాడినా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.ముదిరాజుల కుల వృత్తి పండ్లు అమ్ముకోవడం అని, స్వయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతూ చేపలు పట్టడం పై మొదటి హక్కు గూండ్ల బెస్త వారిదే అన్నారు . గంగపుత్రులు లేని చోట ముదిరాజులు పట్టుకోవచ్చన్నారు.

మొదట మంత్రి గంగుల కమలాకర్ గంగపుత్రుల చరిత్ర తెలుసుకొని మాట్లాడాలన్నారు. ఒక మంత్రి స్థానంలో ఉండి గంగపుత్రుల గురించి కించపరిచే విధంగా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తక్షణమే మంత్రి గంగుల కమలాకర్ గంగపుత్రులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనియెడల గంగపుత్రుల అందరం ఏకమై నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

అంతేకాకుండా గంగపుత్రుల పొట్టను కొట్టే విధంగా ఉన్న జీవో నెంబర్ 6 ను వెంటనే రద్దు చేయాలని, చెరువులపై పూర్తి హక్కులు గంగపుత్రులకే ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేట్ అధ్యక్షులు మాడ వేడి వినోద్ కుమార్, ఉపాధ్యక్షులు ఆలూరు దాసు, బంగ్లా మధుమోహన్, పాక శంకర్, దీటి రవి, దగ్గుల మధుసూదన్, ముంజాల గంగాధర్,ముడారి వేణుగోపాల్, తోపారం కిషన్, నాగారం శంకర్, పాక సుధాకర్ (గంగపుత్ర బెస్తా) బిజెపి ఎక్స్ వై ఎస్ ప్రెసిడెంట్ మండి బజార్ వరంగల్ స్థానిక సంఘాల అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Previous Article

Covid-19: Telangana High Court no Physical hearing until 28 June

Next Article

World Environment Day: Will We Succeed in Saving Our Planet Before It’s Too Late?

You may also like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

20 − 9 =