WhereIsKCR ఎందుకు ట్రెండ్ అవుతుంది ?

Author: Share:

#WhereIsKCR అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియా లో బాగా ట్రెండ్ అవుతుంది. విశేషం ఏంటి అంటే ఇది మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన హ్యాష్ ట్యాగ్.

రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎక్కడ ఎన్ని కొత్త కేసులు నమోదవుతున్నాయో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం.

ముఖ్యమంత్రి నివాసం ప్రగతి భవన్ లో దాదాపుగా 30 మంది సిబ్బందికి కరోనా వైరస్ సోకినట్టుగా వార్తలు వినిపించాయి. ప్రగతి భవన్ లో కేసులు నమోదు అవడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వెల్ లోని తన ఫార్మ్ హౌస్ లో ఉంటున్నటు ఓ పత్రిక తెలిపింది.

ఇటువంటి క్లిష్ట సమయంలో కేసీఆర్ అందుబాటులో లేకపోవడంతో ప్రజలంతా కేసీఆర్ ఎక్కడా అని ప్రశ్నిస్తున్నారు సోషల్ మీడియాలో ఏకంగా “#WhereIsKCR” అని ట్రెండ్ చేస్తున్నారు.

కేటీఆర్ పై సైతం ప్రజలు ఫైర్ అవుతున్నారు ట్విట్టర్ లో వారి మంత్రులకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పే కేటీఆర్ కరోనా వైరస్ వల్ల మాకు ఊపిరాడక చనిపోతున్న రోగులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నప్పటికీ ఆయన స్పందించటం లేదు అంటు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Previous Article

చైనా తొ రాహుల్ గాంది రహస్య ఒప్పందం నిజమేనా….. ?

Next Article

India Vs China: The last 48 hours have been interesting!

You may also like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

one × 3 =