దుబ్బాకలో బీజేపీ గెలుపు రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పుతుందా ?

Author: Share:

రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ గొంతు లేకపోవడం, ప్రధాన ప్రతిపక్షం తన కర్తవ్యం మర్చిపోవడం, గెలిచిన వారు గెలిచినాక తెరాసలో చేరిపోవడం వెరిసి ప్రజా వాణీ వినిపించే నాధుడు కరువైపోయిన సమయంలో దుబ్బాక ఉపఎన్నిక ప్రతేక్యం అయిపోయింది, వివరాల్లోకి వెళితే

కాంగ్రెస్ తన ఉనికి కోల్పోతున్న సమయంలో ప్రజా వాణీ వినిపించేందుకు రాజకీయ పార్టీలు లేకపోయిన తరుణంలో దుబ్బాక ఉపఎన్నిక అభ్యర్థి రఘునందన్ రావు తన వాగ్ధాటి, అనుభవం, అధికార పార్టీపై పోరాట పటిమ ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఈ ఎన్నిక బీజేపీకి ఒక అవకాశంగా కలిసివచ్చింది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవడంలో బీజేపీ సఫలం అయ్యింది. ఈ ఉప ఎన్నికలో బీజేపీ విజయం రాష్ట్ర రాజకీయ పరిణామాల్లో ఒక కొత్త మార్పుకు శ్రీకారంచుట్టింది. రాష్ట్ర నలుమూలల నుండి బీజేపీ కార్యకర్తలను, మరియు నాయకులను ఏకం చేయడంలో దుబ్బాక ఉపఎన్నిక ఒక వేదికయ్యింది, ఇకపోతే బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు, ప్రశ్నించే గొంతు అని దుబ్బాక ప్రజలలోకి తీసుకపోవడంలో బీజేపీ విజయం సాధించింది, నియోజకవర్గ ప్రజలు కూడ కెసిఆర్ కుటుంబ పాలనపై, ఒంటెద్దు పోకడలపై మరియు ఒకప్పుడు ఉద్యమ గడ్డగా ఉన్నటువంటి దుబ్బాక నియోజకవర్గ ప్రజలను మర్చిపోవడం తీవ్ర వ్యతిరేకతకు దారి తీసింది.

దుబ్బాక ఉపఎన్నిక ప్రచారంలో బీజేపీ సోషల్ మీడియాని ప్రధానంగా ఉపయోగించింది, బీజేపీ రాష్ట్ర నాయకత్వం పక్కా ప్రణాళికతో వ్యూహ రచన చేసారు, ప్రచార చివరి అంకెంలో పార్టీకి చెందినటువంటి స్టార్ కాంపైనర్లని, ముఖ్యంగా బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారి ప్రచారం చివరి రోజువరకు కూడ పధకం ప్రకారం రేసులో నిలిచింది.

ఈ ఉపఎన్నిక ద్వారా బీజేపీకి కలిసివచ్చే అంశాలు

1) ఈ విజయం యొక్క సింహ భాగం రఘునందన్ రావు గారికే దక్కుతుంది

2) కార్యకర్తల మరియు నాయకులు సమిష్టిగా పని చేయడం

3) వెలుగులోకి వచ్చిన స్టార్ క్యాంపెయినర్లు , అందులో ప్రధానంగా వినిపించేది ఇందూరు పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గారు

4) బండి సంజయ్ నాయకత్వం ( సీనియర్ మరియు కొత్తగా వచ్చిన వారిని సమన్వయం చేయడంలో విజయం సాధించిండు )

5) బీజేపీ పార్టీ యొక్క దూకుడు ధోరణి

6) నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పధకాలు మరియు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల వివరాలని ప్రజలలోకి తీసుకవెళ్లడంలో సంపూర్ణ విజయం సాధించారు

7) తెరాస ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఎండ గట్టడంలో పైచేయి సాధించారు.

ఈ ఓటమి వల్ల తెరాస కూడా కొన్ని తప్పులు సరిదిద్దుకునె అవకాశం కనిపిస్తోంది.

తెలంగాణ పోరాటంలో యువత నుంచి ఉన్న ఆదరణ ప్రస్తుతం తెరాసకు లేనందున యువతను ఆకర్షించే లక్ష్యంతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేసె అవకాశం ఉంది.

అట్లే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ఇచ్చిన హామీ నిరుద్యోగ భృతి నిలబెట్టుకునె అవకాశం లేకపోలేదు.

కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ కంటె ఎక్కువ ఫామ్ హౌస్ లోనె ఉంటడనె ఆరోపణ రాకుండా ఇక మీదట క్యాంప్ ఆఫీసులో, పీఆర్ టీంలతో హడావుడి ఎక్కువ చేసె అవకాశముంది.

Previous Article

Union Finance Minister Nirmala Sitharaman in series of announcements under Atmanirbhar bharath package speaking at a press conference today said

Next Article

Importance of Dhanteras, Deepawali, Bhai Dooj and Govardhan Pooja as per our Puranas

You may also like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

five × three =